• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘యమలీల’ తర్వాతి ఇదే...

‘యమలీల’ తర్వాతి ఇదే అంటున్నాడు

By - Tupaki Desk
Update: 2016-11-05 01:30 GMT
‘నరుడా డోనరుడా’ తన కెరీర్లో చాలా కీలకమైన సినిమా అంటున్నాడు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. ఈ సినిమాకు తనే హీరో అన్న సుమంత్ మాటల్ని గుర్తు చేసుకుంటూ.. అలా కాకపోయినా ఈ సినిమాలో సగం బాధ్యత తాను తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ‘‘య‌మ‌లీల సినిమాలో హీరోతో స‌మానంగా ఉండే క్యారెక్ట‌ర్ చేశాను. ఆ తర్వాత ‘క‌న‌క మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ డ్యాన్స్’ సినిమాలో కూడా అలాంటి క్యారెక్ట‌రే చేసాను. మ‌ళ్లీ చాలా కాలం త‌ర్వాత ‘నరుడా డోనరుడా’ సినిమాకు స‌గం బాధ్య‌త తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత నాకు ఇంకో నాలుగైదు మంచి క్యారెక్ట‌ర్లు చేసే అవకాశం వ‌స్తుంది. నా స్ధాయిని మ‌రింత పెంచే సినిమా అవుతుంది. అందుక‌నే ఈ చిత్రాన్ని నా సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నాను’’ అని భరణి చెప్పారు.

తాను పాత్ర నిడివి ఎంత అన్నదాని కంటే దాని ప్రాధాన్యం ఎంత అన్నదాన్ని బట్టే సినిమాలు చేస్తుంటానని భరణి అన్నారు. ‘‘నాకు ఒకే ఒక్క సీన్ ఉన్న సినిమాలు కూడా చేస్తుంటాను. కాకపోతే ఆ సీన్ నచ్చాలి. ‘అత‌డు’ సినిమాలో నా మీద తక్కువ సన్నివేశాలుంటాయి. వాటిని నాలుగే రోజుల్లో షూట్ చేసేశారు. కానీ ఆ పాత్ర.. ఆ సన్నివేశాలు గుర్తుండిపోతాయి. ఆడు మ‌గాడ్రా బుజ్జీ.. అనే డైలాగ్ ఎంతో పాపుల‌రైంది. అదే డైలాగ్ తో ‘ఆడు మ‌గాడ్రా బుజ్జి’ అనే సినిమా కూడా వచ్చింది. నేను ఎప్ప‌ట్నుంచో ఇండ‌స్ట్రీలో ఉన్నాను కాబట్టి ఒక్కోసారి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఒక్క సీన్ అయినా చేయాల్సి వ‌స్తుంటుంది. ఐతే ఒక్క సీనే అయినా మ‌న మీద గౌర‌వంతో ఇచ్చారనుకుని.. ఆ ఒక్క సీన్లోనే మ‌న‌మేంటో చూపించాలి అని ఛాలెంజ్ గా తీసుకుని చేస్తుంటాను’’ అని భరణి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Thanikella Bharani 
  • Naruda donaruda Movie 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS