తమన్ కే త్రివిక్రమ్ ప్రాధాన్యత
కాపీ ట్యూన్లు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా అన్ని విమర్శల్ని తిప్పి కొడుతున్నాడు తమన్. ఇన్ టైమ్ లో సంగీతం అందించేవాడిగా పాపులరైన తమన్... తన గురించి తెలియనివాళ్లు నెగెటివ్ గా విమర్శిస్తారని పదే పదే ఇంటర్వ్యూల్లోనే తెలిపారు. ఫలానా పాటలాగా కావాలని అంటారని - అందుకే దాచుకున్న ట్యూన్ బ్యాంక్ లోంచి కొన్నిటినీ ఫ్రెష్ గా తీసి ఇస్తానని తమన్ కాస్తంత వ్యంగ్యంగా చెప్పిన సందర్భం ఉంది. తననుంచి రాబట్టుకునేవాళ్లకు రాబట్టుకున్నంత పని! అని స్పష్టంగా చెప్పాడు.
అయితే తమన్ తో పని చేయించుకున్నవాళ్లలో పూరి బెస్ట్ ఔట్ పుట్ తీసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మేన్ చిత్రానికి తమన్ ట్యూన్లు రీరికార్డింగ్ ప్లస్. ఆ తర్వాత `అరవింద సమేత` చిత్రానికి తనకు కావాల్సిన విధంగా బీజీఎం చేయించుకోవడంలో కానీ - ట్యూన్లు రాబట్టుకోవడంలో కానీ త్రివిక్రమ్ సక్సెసయ్యారు. సంగీతం ఇచ్చేవాడు కాదు సమస్య.. తీసుకునేవాడే!నన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. త్రివిక్రమ్ తో తమన్ కి అంతగా సింకయ్యింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి త్రివిక్రమ్ మరోసారి తమన్ నే ఫైనల్ చేశారు. ఇప్పటికే ట్యూన్లపై సీరియస్ గా కసరత్తు సాగుతోంది. మరోవైపు స్క్రిప్టుకు మెరుగులు అద్దుతున్నారు.
తమన్ అయిపోయాడు అన్న తర్వాత పుంజుకున్న వైనం అంతే ఇంట్రెస్టింగ్. అల్లు అర్జున్ కి రేసుగుర్రం - సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని ఇచ్చాడు. ఇప్పుడు మూడోసారి మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. ఈ సమ్మర్ లోనే బన్ని- త్రివిక్రమ్ జోడీ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం సీరియస్ గా ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సంగీతం కుదిరితే సగం విజయం దక్కినట్టే. అందుకే బాణీలపై త్రివిక్రమ్ - తమన్ జోడీ సీరియస్ గానే పని చేస్తున్నారని అర్థమవుతోంది. అలాగే సినిమాని డ్రైవ్ చేసే బీజీఎం.. రీరికార్డింగ్ థీమ్ పైనా కసరత్తు చేస్తున్నారట.