ప్రతి బిరియానీ సెంటర్ లో వినిపించే పాట
తాను ఏ సినిమాకి సంగీతం అందించినా వందశాతం ఎఫర్ట్ తో పని చేస్తానని అన్నారు ఎస్.ఎస్.థమన్. అల వైకుంఠపురములో పాటల్ని మించి సంక్రాంతి బరిలో రిలీజవుతున్న `క్రాక్` పాటలు చార్ట్ బస్టర్లలో నిలుస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. రవితేజ-శ్రుతిహాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసినదే.
క్రాక్ మూవీ సింగిల్స్ తో ప్రచారం వేడెక్కిస్తున్నారు. నేడు విడుదల కానున్న `క్రాక్ బిర్యానీ..` అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్ లో మార్మోగుతుందని అన్నారు థమన్. రవితేజతో కలిసి పదో సినిమాకి పని చేస్తున్నానని తనకు ఆయన నుంచి కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుందని కూడా థమన్ వెల్లడించారు. రవితేజ శరీరభాషకు కథకు తగ్గ సంగీతం ఎలా ఇవ్వాలో తనకు బాగా తెలుసునని అన్నారు. ఇక దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు నేను సంగీతం అందించానని .. `క్రాక్`తో రవితేజ- గోపీచంద్ జోడీ హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ లోనూ రికార్డింగులో బిజీగా ఉన్నాను. క్రాక్ తర్వాతా పెద్ద క్యూ ఉంది. ప్రస్తుతం తెలుగులో `సర్కారువారి పాట- వకీల్ సాబ్ - టక్ జగదీష్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను. పవన్ 29వ సినిమా సంగీతంపై పని మొదలైంది అని తెలిపారు. అరవింద సమేత తన కెరీర్ వందో సినిమా అని తొలుత తెలియదని తెలిశాక చాలా ఆశ్చర్యపోయానని అంతగా తాను పనిలో లీనమైపోతానని వేరే ఏదీ ఆలోచించనని కూడా థమన్ వెల్లడించారు. 1994లో భైరవద్వీపం చిత్రంతో కెరీర్ ప్రారంభించి కేవలం ఈ 26ఏళ్ల కెరీర్ లో ఇంత సాధించినందుకు ఆనందంగా ఉందని క్రాక్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అన్నారు.