ఈ సారి 5000 కోట్ల క్లబ్‌పై కన్ను..'దురంధర్' బ్యాచ్ సూపర్‌హీరో గేమ్!
తాజా సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను రణవీర్ సింగ్‌తోనే ఖరారు చేశారు.;
దురంధర్- దురంధర్ 2 చిత్రాలతో రణ్ వీర్ సింగ్- ఆదిత్యాధర్ కాంబినేషన్ రూ.3000 కోట్ల వసూళ్ల తో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలతో ఈ రేంజును అందుకున్నారు. ఇక ఇదే జోడీ నుంచి మరో సినిమా రాబోతోందన్నది ఎందరికి తెలుసు? అయితే ఈ క్రేజీ సెన్సేషనల్ కాంబో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈసారి ఏకంగా 5000 కోట్ల క్లబ్ ని సృష్టించాలనే భారీ ప్లానింగ్ తో బరిలో దిగుతున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథా కమామీషు ఏమిటో వివరాల్లోకి వెళితే...
భారతీయ సినీ చరిత్రలో రణవీర్ సింగ్ - దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ ఒక పెను సంచలనంగా మారింది. ధురంధర్-ధురంధర్ 2 చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాక.. ముఖ్యంగా బాహుబలి 2 రికార్డులను సైతం సవాల్ చేస్తూ దూసుకుపోతుండటంతో.. ఇప్పుడు ఈ క్రేజీ జోడీ తమ హ్యాట్రిక్ చిత్రాన్ని మరో లెవల్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి వీరి లక్ష్యం కేవలం వందల కోట్లు కాదు..ఏకంగా రూ. 5000 కోట్ల క్లబ్‌ను సృష్టించాలనే భారీ వ్యూహంతో బాలీవుడ్ బరిలోకి దిగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను రణవీర్ సింగ్‌తోనే ఖరారు చేశారు. 2026లో `ధురంధర్: ది రివెంజ్` అందించిన అద్భుత విజయంతో ఆదిత్య ధర్ మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే అతడు ఒక `లార్జర్ దేన్ లైఫ్` కథాంశాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది గత చిత్రాల కంటే భిన్నంగా.. అత్యున్నత స్థాయి హై- థ్రిల్లింగ్ కాన్సెప్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య ధర్ ఈ ఐడియాను పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చే పనిలో నిమగ్నమై ఉండగా..మార్చి 2027 నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
రణవీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. తన డెబ్యూ ప్రొడక్షన్ చిత్రం `ప్రళయ్` (జోంబీ థ్రిల్లర్) షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఆదిత్య ధర్ ప్రాజెక్టులోకి అడుగుపెట్టనున్నారు. రణవీర్‌లోని అంతులేని ఎనర్జీ, వెర్సటైలిటీ ఈ కొత్త కథకు ప్రాణం పోస్తాయని దర్శకుడు నమ్ముతున్నారు. ఈ భారీ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులకు దాదాపు ఏడాది సమయం కేటాయించడం చూస్తుంటే... సాంకేతికంగా ఈ చిత్రం భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించడం ఖాయమనిపిస్తోంది.
`ధురంధర్` సిరీస్ ఇచ్చిన ధైర్యంతో ఈ మూడవ ప్రాజెక్టును కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. స్క్రీన్ ప్లే లాక్ చేసే ప్రక్రియలో ఉన్నందున నటీనటుల ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే మునుపటి చిత్రాల తరహాలోనే ఇందులో కూడా భారీ తారాగణం ఉండే అవకాశం ఉంది. ఉరి, ధురంధర్ వంటి వరుస హిట్లు ఇచ్చిన ఆదిత్య ధర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ హా*ట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి `ధురంధర్` బ్యాచ్ తమ మూడవ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు బిగ్ ప్లాన్ చేస్తోంది. రూ. 3000 కోట్ల సంచలనం తర్వాత రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ.. భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. కేవలం వసూళ్ల పరంగానే కాకుండా... మేకింగ్ పరంగా కూడా ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చిత్రంగా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు. అయితే లార్జర్ దేన్ లైఫ్ పాత్ర అంటే రణ్ వీర్ సింగ్ సూపర్ హీరోగా నటించబోతున్నారని భావించవచ్చు. అతడు శక్తిమాన్ ని రీమేక్ చేయాలనుకున్నా రైట్స్ సంపాదించలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆ కోరికను ఆదిత్యాధర్ తీర్చబోతున్నాడని భావించాలి. ఎస్.ఎస్.రాజమౌళి వారణాసి తరహాలోనే ఆదిత్యాధర్ తన తదుపరి చిత్రాన్ని పాన్ వరల్డ్ లో చాలా భాషలలో రిలీజ్ చేస్తాడని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.