నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే - ఫరియా ఎమోషనల్ కామెంట్స్!

ఇదే విషయాన్ని తాజాగా గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా తప్పు చేశానని ఫీలయ్యారా?;

Update: 2026-04-29 05:27 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెస్ట్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయం, అంతకుమించి హైట్.. అందరిని ఆశ్చర్యపరిచింది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో అమాయకంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెలో మంచి కొరియోగ్రాఫర్ ఉన్నారనటంలో సందేహం లేదు. బంగార్రాజు సినిమాలో డాన్స్ మాస్టర్ శేఖర్ తో అదిరిపోయే మాస్ స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్న ఈమె ఇటీవల కొన్ని డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించి.. తన అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచింది. అల్లు అర్జున్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తానని చెప్పిన ఈమె.. ఇటీవల దర్శకురాలిగా కూడా సత్తా చాటాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది.

నా జీవితంలో కోలుకోలేని తప్పు చేశా -ఫరియా అబ్దుల్లా

ఇకపోతే ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాలో హీరోయిన్ గా నటించింది.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో తెలియని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్న ఫరియా అబ్దుల్లా తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అలాగే తన తల్లిదండ్రులు మతం మారడం వెనుక అసలు కారణాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికే దక్కుతుంది..

సాధారణంగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని.. అలా రాసి పెట్టకపోతే ఆ మెతుకు మనం తినలేము అనే సామెతను పెద్దలు ఊరికే చెప్పలేదు. అటు సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఏ కథ ఎవరికోసం రాసిపెట్టి ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలా ఒక హీరో లేదా హీరోయిన్ కోసం అనుకున్న కథ రకరకాల కారణాల వల్ల చివరికి ఎవరి దగ్గరకు చేరాలో వారి దగ్గరకి వెళ్తుంది. అలా మిస్ చేసుకున్న సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బాస్టర్ అవుతుంటే.. మరి కొన్నిసార్లు డిజాస్టర్ గా నిలుస్తాయి

. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసిన చిత్రాలు ఫ్లాప్ అయితే ఊపిరి పీల్చుకుంటారు. అదే హిట్ అయితే మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అలా ఫరియా అబ్దుల్లా కి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ లో అవకాశం వచ్చిందట. కానీ చేజేతులారా మిస్ చేసుకుంది..

ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నా - ఫరియా

ఇదే విషయాన్ని తాజాగా గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా తప్పు చేశానని ఫీలయ్యారా? అని ప్రశ్నించగా.. నేను తేజ హీరోగా చేసిన హనుమాన్ సినిమా చేయలేకపోయాను. ఆ సమయంలో నాకు బ్రెయిన్ లేదు. బుద్ధిలేక నో చెప్పాను.. నిజానికి నాకు కథను ఎలా జడ్జ్ చేయాలో తెలియదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. జాతి రత్నాలు హిట్ అయ్యింది . సరైన స్క్రిప్ట్ ఎంచుకోవాలనే ఆలోచనలు కన్ఫ్యూజన్లో పడిపోయాను. అందుకే హనుమాన్ స్క్రిప్టును అంచనా వేయలేక సినిమాను వదిలేసుకున్నాను. అదే నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అందుకే ఇకపై కెరియర్లో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపింది.

అందుకే నా తల్లిదండ్రులు మతాలు మారారు - ఫరియా

ఇక అలాగే తన తల్లిదండ్రులు మతం మార్చుకోవడం పై కూడా మాట్లాడుతూ.. నా పేరు వినగానే అందరూ నేను ముస్లిం అనుకుంటారు. కానీ మా నాన్న పుట్టుకతో ముస్లిం కాదు .ఆయన హిందూ కుటుంబంలోనే పుట్టారు. కానీ తనకు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలు, ప్రశాంతత, పద్ధతులు, దైవచింతన ఇతర అంశాలు నచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయితే మా అమ్మ కూడా మతం మారింది. ఆమె పుట్టుకతో ముస్లిం కానీ హిందూ సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు , దైవచింతన ధ్యానం లాంటివి ఆమె మెచ్చి ఆమె హిందూ మతంలోకి మారిపోయింది. మా కుటుంబంలో మాత్రం మతాల మధ్య తేడా ఉండదు. అన్ని మతాలను గౌరవిస్తాం.. ప్రేమిస్తాం.. ప్రతి మతంలో కూడా మంచిని మాత్రమే తీసుకుంటాం" అంటూ ఫరియా తెలిపింది.

Tags:    

Similar News