• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాలుగోసారి దీపావ‌ళినే...

నాలుగోసారి దీపావ‌ళినే లాక్ చేసిన ద‌ళ‌పతి

By - Tupaki Desk
Update: 2020-05-19 04:45 GMT
త‌మిళ హీరోల‌కు దీపావ‌ళి సెంటిమెంట్ ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతుందో తెలిసిందే. అయితే ఇత‌ర హీరోల కంటే ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కి దీపావ‌ళి సెంటిమెంటు మ‌రీ ఎక్కువ‌‌. ఇప్ప‌టికే అతడు న‌టించిన మూడు సినిమాలు దీపావళి రేసులో రిలీజై విజ‌యం సాధించాయి. ఇప్పుడు నాలుగోసారి దీపావ‌ళి బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ 2020 దీపావ‌ళి బ‌రిలో రిలీజ్ కానుంద‌న్న‌ది తాజా స‌మాచారం.

వాస్త‌వానికి ఏప్రిల్ 9న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా పడింది. కొవిడ్ 19 మ‌హ‌మ్మారీ త‌మిళ‌నాడును అల్ల‌క‌ల్లోలం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఈపాటికే పూర్తి చేసి మాస్ట‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నా కుద‌ర‌లేదు. దీంతో స‌న్నివేశాన్ని విశ్లేషించిన చిత్ర‌బృందం దీపావ‌ళికి వాయిదా వేశారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివ‌రి దశలో ఉంది. కఠినమైన భద్రతా నిబంధ‌న‌ల్ని పాఠిస్తూ పెండింగ్ ప‌నుల్ని పూర్తి చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో టీజ‌ర్లు.. ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లు ఉండ‌వ‌ని తెలుస్తోంది. నేరుగా ఆన్ లైన్ లోనే సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చార చిత్రాల్ని రిలీజ్ చేసేస్తారు. ఈ చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ స‌ర‌స‌న మాళ‌విక మోహనన్.. ఆండ్రియా జెరోమియా తదితరులు న‌టించారు. విజయ్ సేతుపతి కీల‌క పాత్ర‌ను పోషించాడు.
Tags:    
  • Thalapathy Vijay Master to Release During Diwali 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • VijayTheFaceOfKollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS