తెలుగు సినిమాలకు.. ఇంగ్లీష్‌ కావాలా??

Update: 2016-11-29 19:30 GMT
అప్పట్లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ తో టాప్ ప్రొడ్యూసర్ అనే ముద్రను వేయించుకున్నా ఈ బ్యానర్ వారు. ఆ తరువాత అదే సూపర్ స్టార్ తో అట్టర్ ఫ్లాపు తీసి చేతులు కాల్చుకున్నారు. అప్పటినుండి అన్నీ ఫ్లాపులే. అయితే ఇప్పుడు వీరు ఇచ్చిన ఒక ప్రకటన ఇండస్ర్టీలో నవ్వులు పూవులు పూయిస్తుంది.

''అసలు ఏ మాత్రం అనుభవం లేకపోయినా పర్లేదు.. మాకు డైరక్షన్ డిపార్టుమెంటులో పని చేయడానికి ఇంటర్న్స్ కు కావాలి.  ఫ్రెషర్స్ అయినా పర్లేదు కాని.. ఇంగ్లీషులో మాత్రం చాలా ఫ్లూయంట్ గా మట్లాడాలి'' అంటూ ప్రకటన ఇచ్చారు సదరు ప్రొడ్యూసర్ వారు. అసలు తీసేది తెలుగు సినిమాలు అయినప్పుడు ఇంగ్లీషులో ఫ్లూయంట్ గా మాట్లాడటం ఎందుకో? బహుశా ఇంగ్లీషు సినిమాలు ఏమన్నా చూసి తెలుగులో సీన్లు రాయాలేమో అంటూ ఫిలిం నగర్లో జోకులు వేసుకుంటున్నారు.

ఇకపోతే ఇంగ్లీష్‌ అనేది ఒక కీలక మాధ్యమం అయిపోతున్న సంగతి వాస్తవమే కాని.. తెలుగు సినిమాల్లో కూడా చాలా వరకు తెలుగు స్థానంలో ఇంగ్లీషు డైలాగులే వినిపిస్తున్నాయి ఈ మధ్యన. బహుశా ఇలాంటి ఫ్లూయంట్ ఇంగ్లీష్ కావాలనే ప్రొడ్యూసర్ల ప్రభావమే కాబోలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News