• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బిగ్ బాస్ నాన్ స్టాప్'...

'బిగ్ బాస్ నాన్ స్టాప్' లోకి అచ్చ తెలుగందం..!

By - Tupaki Desk
Update: 2022-02-24 14:00 GMT
'ఆవకాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగందం బిందు మాధవి. 'బంఫర్ ఆఫర్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బిందు.. రామ్  పోతినేనితో కలిసి 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అలానే నాని తో కలిసి అమ్మడు 'పిల్ల జమిందార్' వంటి బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే బిందు తెలుగమ్మాయే అయినా టాలీవుడ్ లో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందుకుంది.

కోలీవుడ్ లో దాదాపు 15 చిత్రాల్లో నటించిన బిందు మాధవి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ బిందు మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా కోసం 'మస్తీ' అనే వెబ్ సిరీస్ లో నటించింది.

క్రిష్ క్రియేషన్ లో రూపొందిన ఈ వెబ్ మూవీ ద్వారా బిందు మాధవి అందరి దృష్టిని ఆకర్షించింది. అందం అభినయం కలబోసిన ఈ భామ ఇప్పుడు తిరిగి తెలుగులోనూ పాపులారిటీని దక్కించుకుంటోంది. ఈ క్రమంలో పాపులర్ రియాలిటీ షో తెలుగు 'బిగ్ బాస్' మొట్టమొదటి ఓటీటీ వెర్షన్ లోకి బిందు కంటెస్టెంట్ గా ప్రవేశించనుందని తెలుస్తోంది.

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంతో పాటుగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో ప్రసారం అవుతోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్స్‌ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌ బాస్‌.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమయింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్టింగ్ లో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కానుండటం విశేషం.

హాట్‌ స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి 24*7 ప్రసారం కానున్న 'బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్' కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్‌ ఎంపిక పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలుగు ఓటీటీ బిగ్ బాస్ సీజన్‌-1 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ జాబితాలో తెలుగు తమిళ హీరోయిన్ బిందు మాధవి ఎంపిక కాబడినట్లు తెలుస్తోంది.

నిజానికి బిందు మాధవి 2017లో తమిళ 'బిగ్ బాస్' మొదటి సీజన్ లో పాల్గొంది. సీనియర్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేసిన ఆ సీజన్ లో బిందు టాప్-5 ఫైనలిస్ట్ వరకూ వెళ్ళింది. అయితే చివరకు ఆమె నాలుగవ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు ఓటీటీ బిగ్ బాస్ మొట్ట మొదటి సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

తెలుగు 'బిగ్ బాస్' రియాలిటీ షోలో అదరగొడితే బిందు మాధవి తెలుగులో మళ్ళీ క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే టాలీవుడ్ లో అమ్మడు మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. మరి మన మదనపల్లె అందానికి తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇకపోతే బిందు నటించిన మూడు తమిళ సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి.
Tags:    
  • Bindu Madhavi 
  • Biggboss 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS