• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: ఐ లవ్ యూ...

టీజర్ టాక్: ఐ లవ్ యూ అంటున్న తేజ్

By - Tupaki Desk
Update: 2018-05-01 07:26 GMT

అందమైన అమ్మాయి.. హుషారైన అబ్బాయి.. వర్షం పడుతున్న సమయంలో ఒకరికొకరు ఎదురుపడతారు. హీరోయిన్ ను చూసీ చూడగానే హీరో గుండెల్లో లవ్ బెల్ మోగుతుంది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం హీరో ప్రయత్నించడం మొదలెడతాడు. లవ్ స్టోరీలకు ఇది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. అందంగా తీయాలే కానీ మళ్లీ మళ్లీ చూడాలనే అనిపిస్తుంది.

వరసగా మాస్ యాక్షన్ ఎంటర్ టెయినర్లు చేసి ఎదురుదెబ్త తిన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈసారి రూటు మార్చాడు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టెయినర్ తేజ్ ఐ లవ్ యు చేస్తున్నాడు.  తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. బస్టాప్ లో వర్షం పడుతున్న సమయాన టీ తాగుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ అక్కడే గిటార్ వాయిస్తూ కనిపిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ను చూసి మైమరిచిపోతాడు. అదే టీ హీరోయిన్ కలిసి షేర్ చేసుకుంటున్నట్టు కలలో మునిగిపోతాడు.

ఈ టీజర్ చెప్పుకోదగిన ప్రత్యేకతలేమీ లేకపోయినా హీరో.. హీరోయిన్ల లుక్ మాత్రం బాగుందని చెప్పాలి. ముఖ్యంగా తేజు ఇంప్రెసివ్ గా కనిపించాడు. తేజు - అనుపమ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో వీళ్లిద్దరి పెయిర్ ఫ్రెష్ గా అనిపించింది. కరుణాకరన్ ఇంతకుముందు తీసిన సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలానే చూపించాడు.  కాకపోతే తేజూ ఇలా కనిపించడం ఇదే ఫస్ట్. ప్రేమకథలు అందంగా తీయాలే కానీ మళ్లీ చూడటానికి ప్రేక్షకులు రెడీగానే ఉంటారు. కరుణాకరన్ ఇదే ఫార్ములాను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.

టీజర్ కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Sai Dharam Tej 
  • Anupama Parameswaran 
  • Tej I Love you Movie 
  • Tej I Love You Teaser 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS