చెర్రీ ఇంటికి టాప్ డిజైనర్
రామ్ చరణ్ అండ్ ఉపాసన కలిసి 80 కోట్లు ఖర్చు పెట్టి సొంతిల్లు కట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటి నిర్మాణం పూర్తయిపోగా.. త్వరలో గృహప్రవేశానికి ముహూర్తాలు కూడా చూసేసుకుంటున్నారు. ఇప్పుడు తమ కలల ఇంటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు చెర్రీ కపుల్.
'మిస్టర్ సి అండ్ తరుణ్ తహిలాని.. మాకోసం మెగా ప్యాలెస్ ను సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. త్వరలో మారిపోవడానికి ఉత్సాహంగా ఉన్నా' అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. తరుణ్ తహిలాని.. ఆయన భార్య.. ఇద్దరూ దేశంలోని టాప్ మోస్ట్ డిజైనర్లుగా గుర్తింపు పొందిన వ్యక్తులు. ప్రస్తుతం వీళ్లిద్దరూ హైద్రాబాద్ లోని రామ్ చరణ్-ఉపాసనల ఇంటికి ఫైనల్ టచెస్ ఇచ్చేందుకు కష్టపడిపోతున్నారు.
తరుణ్.. అతని భార్యలతో చెర్రీ సీరియస్ గా డిస్కషన్స్ చేస్తున్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది ఉపాసన. అయితే.. వీళ్లంతా ఉన్నది పాత ఇల్లో కొతత్ ఇల్లో మాత్రం అర్ధం కాలేదు కానీ.. ఇంటి డిజైన్ మాత్రం అదిరిపోయిందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/