చుట్టూ ఎగబడిన నార్త్ ఫ్యాన్స్.. బాలయ్య మాత్రం ఇలా..
లేటెస్ట్ గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్నారు.;
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఆడియెన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'అఖండ 2: తాండవం' ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో దీనిపై బీభత్సమైన హైప్ ఉండేది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా సరే కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా, సినిమాను నిలబెట్టుకోవడానికి మేకర్స్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీమ్ ఇప్పుడు వారణాసిలో ల్యాండ్ అయ్యింది.
లేటెస్ట్ గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుంచి గుడిలో పూజలు చేసే వరకు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సక్సెస్ కోసం, లాంగ్ రన్ లో కలెక్షన్స్ స్టెడీగా ఉండటం కోసం బాలయ్య అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవైపు సినిమా రన్ అవుతున్నా, ప్రమోషన్స్ ఆపకూడదనే ఉద్దేశంతో ఈ టూర్ ప్లాన్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.
ఇక అక్కడ బాలయ్యను చూసి జనాలు ఎగబడ్డారు. మన తెలుగు వాళ్లే కాదు, నార్త్ ఆడియెన్స్ కూడా ఆయన్ని గుర్తుపట్టి సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. మామూలుగా బాలయ్య అంటే సీరియస్ గా ఉంటారనే టాక్ ఉంది. కానీ అక్కడ మాత్రం చాలా కూల్ గా కనిపించారు. ఫ్యాన్స్ అడిగిన వెంటనే చిరునవ్వుతో సెల్ఫీలు ఇచ్చారు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ అందరినీ పలకరించారు. ఆ వీడియోలు చూస్తుంటే బాలయ్య సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే.
నిజానికి సినిమాకు వస్తున్న మిక్స్ డ్ టాక్ వల్ల నార్త్ లో కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే హిందీ బెల్ట్ లో సినిమాను ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈ వారణాసి టూర్ పెట్టుకున్నారు. అఖండ 1 హిందీలో బాగా ఆడింది కాబట్టి, దీన్ని కూడా అక్కడ నిలబెట్టాలని చూస్తున్నారు. పబ్లిక్ లో తిరగడం, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సినిమాకు మళ్ళీ బజ్ క్రియేట్ అవుతుందని మేకర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు.
దీనికి తోడు ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ విజువల్ వండర్ 'అవతార్ 3' రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. ఆ భారీ కాంపిటీషన్ ను తట్టుకుని, అఖండ 2 థియేటర్లలో రన్ అవ్వాలంటే ఇలాంటి స్ట్రాంగ్ ప్రమోషన్స్ తప్పనిసరి. అవతార్ క్రేజ్ ముందు మన సినిమా సైడ్ అయిపోకూడదని బాలయ్య, బోయపాటి స్వయంగా రంగంలోకి దిగారు. వారణాసి సెంటిమెంట్ తో గట్టెక్కాలని చూస్తున్నారు.
బాలయ్య తన కెరీర్ లో ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో ఇంత కేర్ తీసుకోలేదు. రిలీజ్ కు ముందు ముంబై వెళ్లడం, ఇప్పుడు రిలీజ్ తర్వాత వారణాసి వెళ్లడం.. ఇలా సినిమా కోసం తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మరి ఈ వారణాసి యాత్ర, ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.