సమంత మా ఇంటి బంగారం ఏమైంది..?
హీరోయిన్ గా, నిర్మాతగా సమంత రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చూస్తున్నారు. తెలుగులో ఆమె చేస్తానంటే చాలు కానీ వరుస సినిమా ఆఫర్లు వస్తాయి.;
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలు అందరితో వరుస సినిమాలు చేసింది. ఐతే బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు చేయడం మొదలు పెట్టాక ఆమె తెలుగులో సినిమాలు గ్యాప్ ఇచ్చింది. తన సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవీస్ బ్యానర్ లో శుభం సినిమా చేసింది. ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో ఆమె ఇంప్రెస్ చేసింది. ఐతే తన రెండో ప్రొడక్షన్ గా సమంత మా ఇంటి బంగారం సినిమా మొదలు పెట్టింది. ఐతే ఆ సినిమా ఎక్కడివరకు వచ్చిందో తెలియట్లేదు.
సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల మీద..
రీసెంట్ గానే సమంత రాజ్ నిడమోరుతో జీవితాన్ని పంచుకుంది. సో ఎలా లేదన్నా పెళ్లైన ఏడాది పాటు సినిమాల మీద అంత ఫోకస్ చేసే ఛాన్స్ ఉండదు. సమంత మా ఇంటి బంగారంలో ఆమె లీడ్ రోల్ అంతేకాదు తన ప్రొడక్షన్ లో వస్తున్న రెండో సినిమా కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సమంత దాన్ని ఇప్పుడప్పుడే పూర్తి చేసేలా లేదు. మరోపక్క ఆమె సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల మీద అంత ఆసక్తి చూపించట్లేదు.
బాలీవుడ్ లోనే వెబ్ సీరీస్ లు, సినిమాలు చేసి కెరీర్ అక్కడే కొనసాత్గించాలనే ప్లానింగ్ లో ఉంది. ఐతే తెలుగు ఆడియన్స్ సమంతకు చాలా ఇష్టం. వారి కోసమే ఆమె శుభం సినిమాను ఇక్కడ చేశారు. మా ఇంటి బంగారం కూడా కాస్త లేట్ అయినా కచ్చితంగా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఐతే కెరీర్ పై సమంత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
సమంత హిందీ సీరీస్ లతో సరిపెడుతుందా..
తెలుగులో ఇప్పటివరకు కొన్ని ఛాన్స్ లు వచ్చినా ఆమె కాదన్నదని తెలుస్తుంది. ఐతే రాజ్ తో పెళ్లి తర్వాత సమంత మళ్లీ తెలుగులో సినిమాలు కొనసాగిస్తుందా లేదా హిందీలోనే సీరీస్ లతో సరిపెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. మా ఇంటి బంగారం మాత్రమే కాదు సమంత బ్యానర్ నుంచి వరుస సినిమాలు ప్లానింగ్ లో ఉందట. సో త్వరలోనే ఆమె ఫ్యాన్స్ కి ఒక సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు.
హీరోయిన్ గా, నిర్మాతగా సమంత రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చూస్తున్నారు. తెలుగులో ఆమె చేస్తానంటే చాలు కానీ వరుస సినిమా ఆఫర్లు వస్తాయి. మరోపక్క నిర్మాతగా తన భర్త రాజ్ తో కలిసి సమంత పెద్ద ప్లానింగ్ తోనే ఉందని తెలుస్తుంది. సౌత్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత ఇలా సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఇవ్వడం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. తెలుగులో అనుకున్న కథలు రాకపోయినా కనీసం బాలీవుడ్ లో అయినా ఆమె వరుస సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.