నివిన్ పాలి ఫార్మా వెబ్ సీరీస్ ఎలా ఉంది..?

ఫార్మా సీరీస్ 8 ఎపిసోడ్స్ తో మొత్తం 5 గంటల 45 నిమిషాల కంటెంట్ తో వచ్చింది. నివిన్ పాలి సీరీస్ స్టోరీ సెలక్షన్ బాగున్నా స్టోరీ ఉన్నంత బలంగా స్క్రీన్ ప్లే తీసుకెళ్లడంలో మేకర్స్ విఫలమయ్యారు.;

Update: 2025-12-19 10:08 GMT

ప్రేమమ్ హీరో నివిన్ పాలి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అతని కెరీర్ లో మొదటిసారి వెబ్ సీరీస్ చేశాడు అదే ఫార్మా. పి.ఏ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ జియో హాట్ స్టార్ లో రిలీజైంది. ఫార్మా టైటిల్ తోనే ఇదొక ఫార్మాస్యూటికల్స్ నేపథ్యంతో జరిగే కథ అని తెలుస్తుంది. నివిన్ పాలి ఈ సినిమాలో ఒక ఫార్మా డిస్ట్రిబ్యూటర్ గా నటించాడు.

ఇంతకీ ఫార్మా వెబ్ సీరీస్ కథ ఏంటంటే.. వినోద్ (నివిన్ పాలి) ఆర్కేస్ లైఫ్ అనే ఫార్మా కంపెనీలో జాబ్ లో జాయిన్ అవుతాడు. ఐతే తక్కువ టైంలోనే అతను తన జాబ్ లో మంచి పొజిషన్ కి వెళ్తాడు. కొంతకాలం తర్వాత ఈ ఫార్మా కంపెనీలు వెనక చేస్తున్న చీకటి పనులను కనిపెడతాడు. ఆ టైం లోనే రాజీవ్ రావు అనే జాతి సంస్థతో కలిసి వారు చేస్తున్న పనులను బయట పెట్టాలని చూస్తాడు. ఆ తర్వాత వినోద్ లైఫ్ ఎలా మారింది అన్నది సీరీస్ కథ.

మళయాల ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన నివిన్ పాలి కి ఈమధ్య సరైన సక్సెస్ లు పడలేదు. ఐతే వెబ్ సీరీస్ తో ఒక మంచి ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు. కానీ ఇలాంటి కథలు ఆల్రెడీ ఇదివరకే వచ్చాయి. నవీన్ తన పాత్ర వరకు చాలా బాగా చేశాడు. ఇలాంటి కథలు చెప్పేందుకు కథతో పాటు కథనం మెప్పించాలి.

ఫార్మా సీరీస్ 8 ఎపిసోడ్స్ తో మొత్తం 5 గంటల 45 నిమిషాల కంటెంట్ తో వచ్చింది. నివిన్ పాలి సీరీస్ స్టోరీ సెలక్షన్ బాగున్నా స్టోరీ ఉన్నంత బలంగా స్క్రీన్ ప్లే తీసుకెళ్లడంలో మేకర్స్ విఫలమయ్యారు. రాజీవ్ రావుగా రజిత్ కపూర్ నటించారు. ఆ పాత్రకు ఎంతో వెయిట్ ఉంటుందని అనుకోగా అది తేలగొట్టేశారు. శృతి రామచంద్రన్ మాత్రం ఇంప్రెస్ చేస్తారు. నరైన్ కూడా ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు.

ఐతే వెబ్ సీరీస్ స్టోరీ బాగుంటే స్క్రీన్ ప్లే విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఫార్మా విషయంలో అటు ఇటుగా అదే జరుగుతుంది. మెజారిటీ ఆడియన్స్ ముఖ్యంగా ఇలాంటి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఇది ఒక మోస్తారుగా నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఎంటర్టైన్మెంట్ ఇంకా కామెడీ లాంటివి అసలు ఆశించలేం.

నివిన్ పాలి నుంచి వచ్చిన ఈ ఫార్మా సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది. జియో హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ లకు మంచి వ్యూయర్షిప్ ఉంటుంది. మరి నివిన్ చేసిన ఈ ఫస్ట్ అటెంప్ట్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

థ్రిల్లర్ సినిమాలకు మలయాళ పరిశ్రమ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐతే అక్కడ మేకర్స్ మెడికల్ క్రైం థ్రిల్లర్స్ ని అంతగా ప్రయత్నించలేదు. అందుకే నివిన్ పాల్ ఫార్మా వెబ్ సీరీస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఐతే ఈ వెబ్ సీరీస్ తో మలయాళ స్టార్స్ కూడా ఈఅంటి అటెంప్ట్ లు చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News