థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌పై వెంకీ మామా మాటేంటీ?
వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. చిరు నటిస్తున్న `మన శంకర వరప్రసాద్ గారు`లో గెస్ట్ రోల్ చేస్తున్న వెంకీ ఇప్పటికే తన షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసుకుని త్రివిక్రమ్ మూవీకి షిఫ్ట్ అయిపోయాడు.;
దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సంచలనం సృష్టించిన మూవీ `దృశ్యం`. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, సింహళ, చైనీస్ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించింది. ఇక పెకండ్ ఇన్‌స్టాల్ మెంట్ అయిన `దృశ్యం 2`ని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో వి. రవిచంద్రన్ నటించారు. సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి `దృశ్యం 3`పై పడింది. ఇప్పటికే మలయాళంలో సీక్వెల్ షూటింగ్‌ని మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ పూర్తి చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రధమార్థంలో `దృశ్యం 3`ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మలయాళ సీక్వెల్‌కు సంబంధం లేకుండా హిందీలో అజయ్‌దేవగన్ `దృశ్యం 3`ని ప్రారంభించేశాడు. రైట్స్ సమస్య తలెత్తుతుందని భావించిన అజయ్ దేవ్‌గన్ తెలివిగా కొత్త కథతో ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాడట.
మలయాళ సీక్వెల్ రిలీజ్ సమయానికి హిందీ వెర్షన్‌ని కూడా దించేయాలన్నది అజయ్ దేవ్‌గన్ ప్లాన్. `దృశ్యం 3` విషయంలో మలయాళ, హిందీ రంగాల్లో ఇంతగా హడావిడీ జరుగుతుంటే తెలుగు రీమేక్ వెర్షన్‌కు సంబంధించిన మాత్రం ఎలాంటి హంగామా కనిపించక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు భాగాల్లో నటించిన వెంకీ మామ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ విషయంలో మాత్రం ఇప్పటికీ సైలెంట్ మోడ్‌లోనే ఉండటం ఏంటని అంతా ఆరా తీస్తున్నారు.
వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. చిరు నటిస్తున్న `మన శంకర వరప్రసాద్ గారు`లో గెస్ట్ రోల్ చేస్తున్న వెంకీ ఇప్పటికే తన షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసుకుని త్రివిక్రమ్ మూవీకి షిఫ్ట్ అయిపోయాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకీ మామ నటిస్తున్న మూవీ `ఆదర్శకుటుంబం హౌస్ నంబర్ 47`. దీని షూటింగ్ ప్రస్తుతం రాకెట్ స్పీడుతో జరుగుతోంది. ఏప్రిల్ కల్లా దీన్ని పూర్తి చేయాలని వెంకీ ఫుల్ ప్లానింగ్‌లో ఉన్నాడట.
అయితే ఈ హడావిడిలో ఉన్న వెంకీ మామా `దృశ్యం 3` రీమేక్ కు టైమ్ ఇస్తాడా? లఏదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ `దృశ్యం 3` రీమేక్ కోసం వెంకీ రెడీ అయినా డైరెక్టర్ జీతూ జోసెఫ్ మాత్రం ఇప్పట్లో సిద్ధంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. మలయాళ వెర్షన్ పనులు పూర్తి చేస్తే గానీ తెలుగు వెర్షన్ పనులు పట్టాలెక్కవు. అంటే మలయాళ, హిందీ వెర్షన్‌లతో పోలిస్తే తెలుగు వెర్షన్ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.