యూరోపియ‌న్ యాక్ష‌న్ హీరోలా!

తాజాగా `ఛాంపియ‌న్` సినిమా ఈవెంట్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైతం రోష‌న్ మేకోవ‌ర్ చూసి స్ట‌న్ అయిపోయాడు. రోష‌న్ ని ఏకంగా యూరోపియ‌న్ యాక్ష‌న్ స్టార్ లా ఉన్నాడంటూ ఆకాశానికి ఎత్తేసాడు.;

Update: 2025-12-19 08:20 GMT

బాలీవుడ్ గ్రీక్ గాడ్ ఎవ‌రంటే? హృతిక్ రోష‌న్ రోష‌న్ స్మ‌రించుకుంటాం. అత‌డి క‌టౌట్ అలాంటింది మ‌రి. బాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా? హృతిక్ రోష‌న్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్. హృతిక్ లో ఎన్నో యూనిక్ క్వాలిటీస్ మిగ‌తా స్టార్ హీరోల నుంచి స‌ప‌రేట్ చేస్తుంది. హృతిక్ తెర మీద క‌నిపిస్తే? చాలు ప్ర‌త్యేకించి న‌టించాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో హృతిక్ ఇమేజ్ అలాంటింది. టాలీవుడ్ లోనూ త‌యారు చేస్తే అలాంటి స్టార్ ఒక‌ర‌వుతాడు. అత‌డే ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్. హైట్ ..ఫీచ‌ర్స్, హెయిర్ స్టైల్ లో హృతిక్ ఏ మాత్రం త‌గ్గ‌డు రోష‌న్. జూనియ‌ర్ గ్రీక్ నే చూసిన‌ట్లు ఉంటుంది.

హృతిక్ రోష‌న్ పేరును చూసే శ్రీకాంత్ త‌న‌యుడిగా రోష‌న్ అని నామ‌క‌ర‌ణం చేసాడా? అన్న సందేహం చాలా మందిలో ఉంది. తాజాగా `ఛాంపియ‌న్` సినిమా ఈవెంట్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైతం రోష‌న్ మేకోవ‌ర్ చూసి స్ట‌న్ అయిపోయాడు. రోష‌న్ ని ఏకంగా యూరోపియ‌న్ యాక్ష‌న్ స్టార్ లా ఉన్నాడంటూ ఆకాశానికి ఎత్తేసాడు. నిజంగా చ‌ర‌ణ్ మాట వంద శాతం వాస్త‌వం. రోష‌న్ అచ్చంగా యూరోపియ‌న్ స్టార్ నే త‌ల‌పిస్తుంటాడు. అత‌డి హైట్..వెయిట్...హెయిర్ స్టైల్..స్వాగ్ అన్ని రెగ్యుల‌ర్ హీరోల‌కు భిన్నంగా ఉంటాయి. ఓ విదేశీయుడినే చూసిన‌ట్లు ఉంటుంది.

రోష‌న్ తో రాజమౌళి లాంటి డైరెక్ట‌ర్ సినిమా తీస్తే అత‌డు? ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ఒక్క హిట్ తోనే అవుతాడు. హాలీవుడ్ హీరోల‌నే త‌ల‌ద‌న్నుతాడు. రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ ఒక్క చూపు రోష‌న్ వైపు చూస్తే చాలు నిజంగా రామ్ చ‌ర‌ణ్ అన్న‌ట్లు యూరోపియ‌న్ యాక్ష‌న్ స్టార్ తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి త‌యార‌వుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రామ్ చ‌ర‌ణ్ లాంటి గ్లోబ‌ల్ స్టారే అంత మాట అన్నాడు అంటే? చ‌ర‌ణ్ కి రోష‌న్ ని చూడ‌గానే క‌లిగిన తొలి ఫీలింగ్ అది. స్వ‌చ్ఛంగా మ‌న‌సులో నుంచి వ‌చ్చిన మాట‌. కానీ ప్రాక్టిక‌ల్ గా అది అంత ఈజీనా. హీరోని చేయాల‌న్నా? రాజ మౌళి అత‌డి వైపు చూడాల‌న్నా? ఎన్నో ఈక్వెష‌న్స్ ఉంటాయి.

ప్ర‌స్తుతం రోష‌న్ హీరోగా `ఛాంపియ‌న్` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇదొక పీరియాడిక్ స్పోర్స్ట్ డ్రామా. రోష‌న్ పోస్ట‌ర్ల‌కు, ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో రోష‌న్ మైఖెల్ సి. విలియ‌మ్స్ అనే పాత్ర పోషిస్తున్నాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ అద్వైతం రోష‌న్ ని న్యూ మేకోవ‌ర్ లో అద‌ర‌గొట్టాడు. ఈ కాన్సెప్ట్ గ‌నుక క‌నెక్ట్ అయితే రోష‌న్ కి మంచి పేరొస్తుంది. రోష‌న్ హీరోగా `నిర్మ‌లా కాన్వెంట్` తో పరిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం `పెళ్లి సంద‌డి` అనే మ‌రో చిత్రంలో న‌టించాడు. ఈ రెండు చిత్రాలు రోష‌న్ కి ప‌రిచ‌యం వ‌ర‌కే ప‌రి మితం.

Tags:    

Similar News