విజయ్ 'జన నాయగన్' కొత్త ట్రీట్.. అనిరుధ్ ఎలివేషన్ అదుర్స్..

అయితే ఇప్పుడు జన నాయగన్ మేకర్స్.. సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఒరు పేరే వరాలారును శుక్రవారం విడుదల చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ కు వివేక్ లిరిక్స్ అందించారు.;

Update: 2025-12-19 10:11 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సభలు, ర్యాలీలతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో అభిమానులను అలరించడానికి జన నాయగన్ మూవీ చేస్తున్నారు. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది.

2026 జనవరి 9వ తేదీన పాన్ ఇండియా రేంజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుండగా.. ఇప్పటికీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయ్ చివర సినిమా అని తెలుస్తుండడంతో.. అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్.. ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మేకర్స్ మొదటి సింగిల్ దళపతి కచేరీ సాంగ్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఎప్పటిలానే మరో మాస్ బీట్‌ తో అలరించారు. విజయ్.. కో డ్యాన్సర్లతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన ఫ్యాన్స్ ను ఫుల్ గా ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు జన నాయగన్ మేకర్స్.. సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఒరు పేరే వరాలారును శుక్రవారం విడుదల చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ కు వివేక్ లిరిక్స్ అందించారు. విశాల్ మిశ్రా, అనిరుధ్ రవిచందర్ కలిసి ఆలపించిన ఒరు పేరే వరాలారు సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సాంగ్ లో విజయ్ ను అనిరుధ్ ఎలివేట్ చేసిన విధానం మామూలుగా లేదని సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అనిరుధ్ కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా చెబుతున్నారు. చాలా బాగుందని అంటున్నారు. ఒరు పేరే వరాలారు సాంగ్ కు గాను ఆకట్టుకునే లిరిక్స్ కు అట్రాక్ట్ చేసే మ్యూజిక్ తోడు అయిందని కొనియాడుతున్నారు.

ముఖ్యంగా సాంగ్ లో విజయ్ డ్యాన్స్ మూవ్స్ అదిరిపోయాయి. దళపతి అంటూ లిరిక్స్ వస్తుండగా... ఆయన తన స్టెప్పులతో మెప్పించారని చెప్పాలి. కొందరు మాత్రం ఇప్పుడు సాంగ్ ను ట్రోల్ చేస్తున్నారు. విజయ్ మూవీస్ నుంచి ఏ పాట వచ్చినా ట్రోల్ చేసేందుకు రెడీగా ఉండే బ్యాచే ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, మనీషా బ్లెస్సీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న జననాయగన్.. భగవంత్ కేసరికి రీమేక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News