స్టార్‌ హీరో వ్యాపారంలోనూ అదే తీరు..!

Update: 2023-05-23 08:00 GMT
తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో నేరుగా సినిమాలు చేయకున్నా కూడా ఆయన పద్దతులు మరియు ఆయన యొక్క డబ్బింగ్ సినిమాల కారణంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులను దక్కించుకోగలిడాడు. అజిత్ యొక్క అభిరుచి గురించి అందరికి తెల్సిందే.

వందల కిలో మీటర్లు.. వేల కిలో మీటర్ల బైక్ రైడ్‌ చేస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డులను తానే తిరగ రాసుకుంటూ సరికొత్త ప్రపంచంలో ఎప్పుడూ బైక్ పై తిరుగుతూ ఉంటాడు. ఆయన బైక్‌ రైడింగ్ ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్టరాలను టచ్ చేస్తూ ఒక భారీ మెగా బైక్‌ రైడ్‌ ను మొదలు పెట్టాడు.

ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ ఇంకో వైపు వ్యాపారంలో అడుగుపెట్టబోతున్నాడు. అజిత్ వంటి వారు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది.. ఎలాంటి వ్యాపారం చేస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరు ఊహించినట్లుగానే బైక్ రైడింగ్ కు సంబంధించిన వ్యాపారంలో అజిత్ కుమార్ అడుగు పెట్టబోతున్నాడు.

ఏకే మోటో రైడ్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి ఔత్సాహిక మోటో రైడర్స్ కి సహకారం అందిస్తూ ఉంటారు. చాలా మందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ వారికి సరైన బైక్ లేకపోవడంతో పాటు ఎక్కడ బైక్ రైడ్ చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందనే విషయాలు తెలియక మొదలు పెట్టి కొన్నాళ్లకే ఆపేస్తూ ఉంటారు.

ఇప్పుడు అజిత్ కుమార్ ఏర్పాటు చేసిన ఏకే మోటో రైట్స్ వల్ల ఎవరైతే బైక్ రైడింగ్‌ ఇంట్రెస్ట్ ఉందో వారికి అన్ని విధాలుగా సర్వీస్ ను అందజేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేసిన అనుభవజ్ఞులు గైడ్ లు గా ఏర్పాటు చేసుకుని ఔత్సాహికులు బైక్ రైడింగ్‌ చేయవచ్చు.

ఇందు కోసం బైక్ రైడర్స్ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త వ్యాపారంలో కచ్చితంగా అజిత్ సక్సెస్ అవుతాడు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Similar News