లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బీ.. ఇదే ఆఖరిదా?
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్ బీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్ బీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఎంతోమంది ఫేవరెట్ స్టార్ గా మారిపోయారు. ముఖ్యంగా ఎనిమిది పదుల వయసులో కూడా యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తూ.. తన ఎనర్జీ లెవెల్స్ ని నిరూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందుకు ఉదాహరణ గతంలో వచ్చిన కల్కి2898 సినిమా అనే చెప్పాలి. అందులో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు అమితాబ్ బచ్చన్.
ఒకవైపు నటుడిగా.. మరొకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయారు. అలాంటి ఈయన తాజాగా లైవ్ లో కన్నీళ్లు పెట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఒక షో రెండు, మూడు సీజన్లను జరుపుకుంది అంటే ఆయా సీజన్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని అందుకు సంబంధించిన హోస్ట్ లేదా నటీనటులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే గత 25 సంవత్సరాలుగా ఒక షోతో ఆయనకున్న బంధం విడదీయరానిది. అదే కౌన్ భనేగా కరోడ్పతి.
సామాన్యులకు అగ్నిపరీక్ష లాంటి ఈ షో ద్వారా ఎంతో మంది ఈ అగ్ని పరీక్షను నెగ్గి.. కోట్ల రూపాయలను తమ సొంతం చేసుకున్నారు. ఇక ఈ షోని గత 17 సీజన్లుగా ముందుకు సాగిస్తూ హోస్ట్గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ ఈ కౌన్ భలేగా కరోడ్పతి షోలో కన్నీళ్లు పెట్టుకొని అభిమానులను కూడా కన్నీళ్లు పెట్టించారు.
అసలు విషయంలోకి వెళ్తే.. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 గ్రాండ్ ఫినాలే ఈరోజు అత్యంత భావోద్వేగభరితంగా జరగనుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు." నా జీవితంలో మూడింట ఒక వంతు మీతో గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే సీజన్లో అమితాబ్ బచ్చన్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ ఇంతటితో ముగిసిపోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సీజన్ ను ఇంకా ఇలాగే కొనసాగిస్తారా ఒకవేళ కొనసాగించేటట్టు ఉంటే ఇప్పుడు ఎందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బహుశా ఇదే ఆఖరి సీజన్ కావచ్చు అంటూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ ఇక్కడితో ఆగిపోతుందా అనే విషయం తెలియాలి అంటే ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో బహుశా ప్రకటిస్తారేమో ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ఈ ముగింపు ఎపిసోడ్ లో అగస్త్య నంద సందడి, కికు శారదా హాస్యం, బిగ్ బి అరుదైన సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.