అలాగైతే దీపిక, కియారా కూడా కష్టమే!
పెళ్లి అయిన తర్వాత తల్లి కూడా అయితే? నటిగా మునుపటి అంత వేగంగా పని చేయలేము? అన్నది అలియాభట్ అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.;
కొంత కాలంగా ఇండస్ట్రీలో హవా ఎవరిది అంటే? పెళ్లైన భామలు..తల్లులుగా ప్రమోట్ అవుతున్న వారి పేర్లే వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణే, కియారా అద్వానీ, అలియాభట్, కీర్తి సురేష్, నయనతార తో పాటు ఇంకొంత మంది డిమాండింగ్ భామలుగా హైలైట్ అయ్యారు. పెళ్లైన తర్వాత వారి మార్కెట్ రెట్టింపు అయిందని...కొత్త అవకాశాలన్నీ వారికే ఎక్కువగా వస్తున్నాయని సర్వేలు సైతం తేల్చాయి. పెళ్లిని ఓ సెంటిమెంట్ గా భావించి అవకాశాలు ఇచ్చే దర్శక, నిర్మాతలు పెరిగారని మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కించాయి.
వీళ్ల వేగం చూసి ఇప్పట్లో ఎదురెళ్లడం కూడా కష్టమన్నట్లు మిగతా భామలు ఓ అంచనాకి వచ్చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు సంగతి ఏంటి అంటే? పెళ్లి అవ్వడం వరకే. పెళ్లి అయిన తర్వాత తల్లి కూడా అయితే? నటిగా మునుపటి అంత వేగంగా పని చేయలేము? అన్నది అలియాభట్ అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. తల్లైన తర్వాత తాను సినిమాలు తగ్గించానని...ఇప్పుడు అంత యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నానని తెలిపింది. ముఖ్యంగా యాక్షన్ నేపథ్యం గల చిత్రాలు చేయాలంటే? ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుందని.. టేక్ ల మీద టేకులు తీసుకుంటే అలసట తొందరగా వస్తుందని ఆ కారణంగానే తాను సినిమాలు తక్కువగా చేస్తున్నట్లు తెలిపింది.
ఇటీవలే దీపికా పదుకొణే కూడా 'కల్కీ 2' నుంచి ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదీ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. సుమతి పాత్ర కోసం దీపిక కూడా ఎక్కువగానే శ్రమించింది. గర్బవతి పాత్రలో దీపిక ఎఫెర్ట్ అంతా తెరపై కనిపించింది. మొదటి భాగంలో కనిపించింది కాసేప అయినా? రెండవ భగంలో దీపిక పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దీపిక 'కల్కి 2' నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అధిక పని గంటలు పని చేయాలని నిర్మాతల డిమాండ్ అందుకు అధిక పారితోషికం చెల్లించాలని దీపిక డిమాండ్ చేయడం తెలిసిందే.
దీపికా పదుకొణే ఎగ్జిట్ ని పరిశీలిస్తే? అలియా భట్ చెప్పినట్లు 'కల్కి 2' శ్రమను తట్టుకోలేక దీపిక ఎగ్జిట్ అవ్వడానికి మరో కారణం కూడా అయి ఉండొచ్చు. దీపిక కూడా తల్లైన నేపథ్యంలో మునుపటిలా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి ప్రశాంతంగా ఉండే కాన్సెప్ట్ లనే ఎంచుకుంటున్నారు. అలాగే కియారా అద్వాణీ కూడా వేగం తగ్గించి సినిమాలు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వెనుక తాను కూడా తల్లి కావడంతోనే ఈ నిర్ణయం తీసుకుందా? అన్న సందేహం రాకమానదు. దీపిక, కియారాలు కూడా ఇకపై భారీ యాక్షన్ సన్నివేశాలున్న చిత్రాల్లో నటించడం చాలా అదరుదుగానే జరుగుతుందేమో.