ఏంటిది రాజా సాబ్ ..అక్క‌డ సౌండ్ లేదే!

దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ని, సినిమా మార్కెట్ స్వ‌రూపాన్నే స‌మూలంగా మార్చేయ‌డంతో ఇండియా వైడ్‌గా ప్ర‌భాస్‌కు భాఈ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది.;

Update: 2026-01-03 05:27 GMT

ప్ర‌భాస్‌..వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. `బాహుబ‌లి` త‌రువాత పాన్ ఇండియాస్టార్‌గా మారిన ప్ర‌భాస్ అప్ప‌టి నుంచి అదే త‌ర‌హా సినిమాలుచేస్తూ త‌న మార్కెట్‌ని సుస్థిరం చేసుకుంటున్నాడు. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్‌ సూప‌ర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. తెలుగు సినిమా మార్కెట్‌ని రికార్డు స్థాయికి తీసుకెళ్ల‌డ‌మే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా భారీ మార్కెట్‌ని క్రియేట్ చేసి ఎంత మంది నిర్మాత‌ల‌కు, హీరోల‌కు, డైరెక్ట‌ర్ల‌కు ఫేమ్‌ని, పాపులారిటీని తెచ్చి పెట్టాడు.

దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ని, సినిమా మార్కెట్ స్వ‌రూపాన్నే స‌మూలంగా మార్చేయ‌డంతో ఇండియా వైడ్‌గా ప్ర‌భాస్‌కు భాఈ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. `బాహుబ‌లి` ఏర్ప‌డిన క్రేజ్‌ని, మార్కెట్‌ని ప్ర‌భాస్ ఇప్ప‌టిక అదే స్థాయిలో కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నాడు. నెట్టింట భారీ ట్రోల్‌కు గురైన `ఆదిపురుష్‌` లాంటి సినిమాకు కూడా దేశ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయంటే దానికి ప్ర‌భాస్ క్రేజే కార‌ణం. అంత‌గా ఇండియ‌న్ మార్కెట్‌ని, ప్రేక్ష‌కుల్ని ప్ర‌భాస్ ప్ర‌భావితం చేశాడు.

దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్ప‌డ‌టంతో ప్ర‌భాస్ త‌న ప్ర‌తి సినిమా ప్ర‌మోష‌న్స్ సౌత్‌తోపాటు నార్త్‌లోనూ భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో త‌ను న‌టించిన సినిమాల‌కు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ భారీ ఓపెనింగ్స్ ల‌భిస్తున్నాయి. అయితే ఈ విష‌యాన్ని `ది రాజా సాబ్‌` టీమ్ పూర్తిగా విస్మ‌రించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `ది రాజా సాబ్‌`. ప్ర‌భాస్ చేసిన తొలి హార‌ర్ కామెడీ సినిమా ఇది. అంతే కాకుండా స‌లార్‌, క‌ల్కి 2898 ఏడీ వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఇది.

అలాంటి సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో `ది రాజాసాబ్‌` టీమ్ ఇంత సైలెంట్‌గా ఉండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ప్ర‌భాస్ సినిమా అంటే ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా విష‌యంలో ఇంత వ‌ర‌కు టీమ్ ఉత్త‌రాదిలో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంది. ప్ర‌భాస్ న‌టించిన ఒక‌టి అర సినిమాలు ద‌క్షిణాదిలో డిజాస్ట‌ర్ అనిపించుకున్నా ఉత్త‌రాదిలో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత‌లు ఉత్త‌రాదిలో భారీగా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేసి వ‌సూళ్లు భారీగా వ‌చ్చేలా చూస్తుంటారు.

కానీ `ది రాజాసాబ్‌` టీమ్ మాత్రంఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారేంట‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ ఖ‌ర్చు విష‌యంలో వెనుకాడ‌ర‌నే పేరున్న నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ `ది రాజాసాబ్‌` ఉత్త‌రాది ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఇలా అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారేంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇప్ప‌టికే ముంబ‌యిలో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వ‌హించాల్సింది.

సినిమా రిలీజ్‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా పీపుల్స్‌ మీడియాలో నిర్మించిన తొలి భారీ పాన్ ఇండియా మూవీ అయినా అక్క‌డ సౌండ్ చేయ‌కుండా సైలెంట్ కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇప్ప‌టికైనా ఉత్త‌రాదిలో ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టి సౌండ్‌ పెంచితే ది రాజాసాబ్ అక్క‌డ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంద‌ని, బాలీవుడ్‌కు ఇష్ట‌మైన హారర్ కామెడీ జోన‌ర్ కాబ‌ట్టి భారీ వ‌సూళ్లు ఖాయ‌మ‌ని అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి టీమ్ ఇప్ప‌టికైనా తేరుకుని ప్ర‌మోష‌న్స్ స్పీడ‌ప్ చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే

Tags:    

Similar News