MSG, రాజాసాబ్.. ప్రీమియర్స్ రేట్ల సంగతేంటి?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తమ సినిమాలతో సంక్రాంతి పండుగ కానుకగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తమ సినిమాలతో సంక్రాంతి పండుగ కానుకగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో చిరంజీవి.. ది రాజా సాబ్ చిత్రంతో థియేటర్స్ లోకి రానున్నారు. తక్కువ గ్యాప్ లోనే ఆ రెండు సినిమాలు రిలీజవుతున్నాయి.
మొదట జనవరి 9వ తేదీన రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదలవుతుంది. అయితే రెండు సినిమాలకు తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ ఉండనున్నాయి. విడుదలకు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్ అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు.
అయితే ప్రీమియర్స్ షో రేట్స్ స్పెషల్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ టికెట్ రేట్లు ఎంత ఉంటాయోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన పెద్ద సినిమాల ప్రీమియర్స్ రేట్లు భారీగా ఉన్నాయి. ఇప్పుడు మరెంత ఖరారు చేయనున్నారోన్నది హాట్ టాపిక్.
మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ రేటును రీజనబుల్ గానే పెట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం మూవీ జోనరేనట. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాకు తక్కువ రేట్ పెడితే.. కుటుంబ ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం. అందుకే మేకర్స్ అతి తక్కువ ప్రీమియర్ రేటు పెడుతున్నట్లు టాక్.
అదే సమయంలో రాజా సాబ్ ప్రీమియర్ రేట్.. రూ.500కు పైగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కొందరు రూ.600 అంటుంటే.. మరికొందరు రూ.800 ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య నటించిన అఖండ మూవీ ప్రీమియర్ టికెట్ రేట్ ను రూ.600గా ఫిక్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అదంతా ఒకెత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రీమియర్స్ కోసం ఈజీగానే అనుమతులు వస్తాయి. అదనపు రేట్ కోసం జీవో కూడా జారీ అవుతుంది. కానీ తెలంగాణలో అసలు సమస్య ఉంది. రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఎలాంటి అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు.
కాబట్టి తెలంగాణలో అనుమతులు వస్తాయో లేదో అన్నది ఎలాంటి క్లారిటీ లేదు. నిర్మాతలు ఆ మధ్య.. సర్కార్ ను రిక్వెస్ట్ చేస్తామని తెలిపారు. ఏదేమైనా ఏపీలో కచ్చితంగా ప్రీమియర్స్ ఉండనున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం డౌటే. ఒకవేళ తెలంగాణలో కూడా పర్మిషన్ వస్తే.. రెండు స్టేట్స్ లో ప్రీమియర్ షోస్ రేట్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.