సూపర్‌స్టార్ ఫ్యామిలీలో ఎలాంటి ఆస్తి గొడవల్లేవ్
బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర కాలం చేసాక, ఆయన ఇద్దరు భార్యల వారసత్వాలపై రకరకాల కామెంట్లు వినిపించాయ.;
బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర కాలం చేసాక, ఆయన ఇద్దరు భార్యల వారసత్వాలపై రకరకాల కామెంట్లు వినిపించాయ. మొదటి భార్య కుమారులతో హేమమాలిని కుమార్తెలకు ఆస్తి సంబంధ గొడవలు మొదలయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి.
ధర్మేంద్ర మరణానంతరం డియోల్ బ్రదర్స్..హేమమాలిని కుటుంబం వేర్వేరుగా సంస్మరణ సభలు ఏర్పాటు చేయడం, ఉమ్మడిగా ఆత్మీయ సభలను నిర్వహించకపోవడం వంటివి వారి మధ్య వేరు కుంపటి గురించిన ప్రచారానికి ఊతమిచ్చింది. ఆ రెండు కుటుంబాలు కలిసికట్టుగా ధర్మేంద్ర గురించి సంస్మరించలేదని కథనాలొచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఆ రెండు కుటుంబాలు స్థబ్దుగా ఉన్నాయి.
ఇలాంటి సమయంలో దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న హేమమాలిని కుమార్తె ఇషా డియోల్ తన తండ్రి, దివంగత సూపర్‌స్టార్ ధర్మేంద్రను స్మరించుకుంటూ 2026వ సంవత్సరానికి స్వాగతం పలికారు. వెటరన్ స్టార్ ధర్మేంద్ర నవంబర్ 2025లో 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ఇషా తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా నేపథ్యంలో ఉండగా, ఇషా ఆకాశం వైపు చూపిస్తూ `లవ్ యూ పాపా` అని రాశారు. దీనికి కింద కామెంట్స్ విభాగంలో, ధర్మేంద్ర చిన్న కుమారుడు, ఇషా సవతి సోదరుడు బాబీ డియోల్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ సోదరిపై తన ప్రేమను కురిపించారు. ఇషా బాబీ కామెంట్‌కు తిరిగి ట్యాగ్ చేస్తూ, మరిన్ని హార్ట్ ఎమోజీలను షేర్ చేసింది. తోట్టువుల నడుమ తీయనైన సంభాషణలు హృదయాలను హత్తుకున్నాయి.
నిజానికి ధర్మేంద్రకు ఒకసారి మాత్రమే పెళ్లయింది. హేమమాలినిని అతడు పెళ్లాడలేదు. ఆమె ఎప్పుడూ అతడితో కలిసి లేరు. వారికి సపరేట్ గా ఇల్లు ఉంది. ధర్మేంద్ర అక్కడికి వచ్చి వెళ్లేవారు. లెజెండరీ నటుడు తన చివరి రోజుల్లో మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో ముంబైలోని ఫామ్ హౌస్ లో నివశించారు. ఇక డియోల్ బ్రదర్స్ తో ఇషా డియోల్, అహనా డియోల్ సిస్టర్స్ కి ఎలాంటి విభేధాలు, శత్రుత్వం లేదు. ఇంతకుముందు ఓ టీవీ కార్యక్రమంలో ఇషా మాట్లాడుతూ... సన్నీడియోల్, బాబి డియోల్ సోదరులకు తాము సన్నిహితంగా ఉంటామని తెలిపారు. సన్నీ భయ్యాను ఎక్కువగా కలవగలుగుతామని అన్నారు. ఎందుకంటే మేము విదేశాలకు లేదా లండన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ అతడిని ఎక్కువగా కలుస్తాము. అతడితో చాలా సమయం గడుపుతాము. బాబీ భయ్యా అప్పుడప్పుడు వస్తుంటాడు.. కానీ మేం సన్నీ భయ్యాతోనే ఎక్కువ సమయం గడపగలిగామని తెలిపారు.