సూపర్‌ స్టార్‌ గురించి తెలియదన్న తమన్నా...ఫ్యాన్స్‌ ఫైర్‌

Update: 2019-10-12 17:30 GMT
తమన్నా ఇటీవల నటించిన 'పెట్రోమాక్స్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్‌ సందర్బంగా ఆమె తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. తమిళ తంబీలు తమ అభిమాన హీరోలను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఏ స్థాయిలో విరుచుకు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా విజయ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసి సారీ చెప్పే వరకు వదలరు. ఇప్పుడు తమన్నాను విజయ్‌ ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేశారు.

'పెట్రోమాక్స్‌' ప్రమోషన్‌ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నాను ఇంటర్వ్యూవర్‌ హీరో విజయ్‌ గురించి మీ స్పందన ఏంటీ అంటూ అంటూ ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో తమన్నా స్పందిస్తూ ఆయన గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను. కాని ఆ సమయంలో నాకు ఆయనకు మద్య ఎక్కువ కమ్యూనికేషన్‌ జరగలేదు. షూటింగ్‌ కు వెళ్లామా వచ్చామా అన్నట్లుగా ఉండేది. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడగలను.. ఆయన గురించి ఏమీ తెలియకుండా ఎలా కామెంట్‌ చేయగలను అంది.

తమన్నా మాటలకు విజయ్‌ ఫ్యాన్స్‌ నొచ్చుకున్నారు. ఆయన గురించి తెలియదని తమన్నా చేసిన వ్యాఖ్యలకు వారు సీరియస్‌ అవుతున్నారు. సూపర్‌ స్టార్‌ గురించి తెలియదని.. ఆయన గురించి మాట్లాడటానికి ఏమీ లేదని నీవు చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. విజయ్‌ తో నటించాలని ఉంది అంటూ చాలా కాలంగా చెబుతు వస్తున్న తమన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. తెలుగు మరియు తమిళంలో ఈమె క్రేజ్‌ కాస్త తగ్గింది. మళ్లీ బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో విజయ్‌ ఫ్యాన్స్‌ కు బుక్కయ్యింది.

Tags:    

Similar News