మిల్కీ బ్యూటీ నోట.. తెలంగాణ యాస!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 15ఏళ్లు అవుతున్నా హీరోయిన్ తమన్నా గ్లామర్ ఇంత కూడా తగ్గలేదు. ఇప్పటికి తన గ్లామర్ తో సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తమన్నా సీటీమార్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే.. తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తుందట. తెలంగాణ అమ్మాయిగా కనపడటానికి తమన్నా చాలానే మేకోవర్ అయ్యిందట. తెలంగాణ యాసతో అప్పట్లో డైనమిక్ విజయశాంతి మంచి గుర్తింపు తో పాటు నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అదే యాసతో సాయి పల్లవి ఫిదా చిత్రంలో మ్యాజిక్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తరువాత ఎంతో మంది ప్రయత్నించినా అంతగా రాణించ లేకపోయారు. ఇప్పుడు అదే తెలంగాణ యాసను తమన్నా ట్రై చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా పవర్‌ఫుల్ పాత్రలో జ్వాలారెడ్డిగా కనిపించనుంది. తెలంగాణ యాస పై పట్టు సాధించడం కోసం తమన్నా భారీ కసరత్తులే చేస్తోందట. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కబడ్డీ కూడా నేర్చుకున్న తమన్నా.. ఇంతకుముందెన్నడూ ఆడని కబడ్డీ ఆట నేర్చుకున్నానని, చాలా వరకు ఈ పాత్రలో లీనం కావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నానని, అయితే తెలంగాణ యాసని నేర్చుకోవడం కొంత ఇబ్బందిగా మారిందని చెబుతోంది. అయితే దర్శకుడు సంపత్ నంది తెలంగాణ కు చెందిన వ్యక్తే కావడం తో ఆయన ఇచ్చిన సలహాలతో యాస పై పట్టు సాధిస్తున్నానని తమన్నా చెప్పింది. చూడాలి మరి తెలంగాణ యాసలో మిల్కీ బ్యూటీ ఎలా మెప్పిస్తుందో..!