శివ కార్తికేయ‌న్ రూ.50 ల‌క్ష‌ల స్టోరీ!

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి స్టోరీ నేప‌థ్యంలో సాగే డివోష‌న‌ల్‌, యాక్ష‌న్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు.;

Update: 2026-04-15 12:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ కున్న ప్ర‌త్యేక‌తే వేరు. కోలీవుడ్ హీరోల్లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే క‌లైమామ‌ని పుర‌స్కారాన్ని సొంతం చేసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన శివ కార్తికేయ‌న్ చిన్న స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా, నిర్మాత‌గా అద్భుత‌మైన విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ త‌మిళ‌నాట మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ నిర్మిస్తున్న `సేయోన్‌` మూవీలో న‌టిస్తున్నారు.

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి స్టోరీ నేప‌థ్యంలో సాగే డివోష‌న‌ల్‌, యాక్ష‌న్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. శివ కుమార్ మురుగేష‌న్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే శివ కార్తికేయ‌న్ గొప్ప‌త‌నం గురించి న‌టుడు ప్రేమ్ కుమార్ చెప్పిన స్టోరీ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. శివ కార్తికేయ‌న్‌తో త‌న‌కున్న భావోద్వేగ‌భ‌రిత అను బంధాన్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించడ‌మే కాకుండా రూ.50 ల‌క్ష‌ల‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టారు.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. ప్రేమ్ కుమార్ ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. `మా అబ్బాయికి విదేశాల్లో చ‌దువుకోవ‌డానికి అడ్మీష‌న్ వ‌చ్చింది. నేను దీనికి సంబంధించిన ఎడ్యుకేష‌న్ లోన్ కోసం ఓ బ్యాంక్ వారిని సంప్ర‌దించాను. అయితే ఎడ్యుకేష‌న్ లోన్ కోసం స‌ద‌రు బ్యాంక్ వారు ఎవ‌రిదైనా ష్యూరిటీ కావాల‌న్నారు. అయితే అప్ప‌టికే నా ఇంటికి సంబంధించిన ఈఎంఐ ఉండ‌టంతో నేను చాలా ఇబ్బ‌దులు ప‌డుతున్నాను.

ఇదే విష‌యాన్ని మాట‌ల సంద‌ర్భంలో స‌ర‌దాగా హీరో శివ కార్తికేయ‌న్‌కు చెప్పాను. ఆయ‌న దాన్ని సీరియ‌స్‌గా తీసుకుని నాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా, నాకు చెప్ప‌కుండానే బ్యాంకులో రూ.50 ల‌క్ష‌లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాన్ని నాకు పూచీక‌త్తుగా ఇచ్చారు. నేను ఆ డ‌బ్బు తిరిగి ఇచ్చేంత వ‌ర‌కు త‌ను దాని గురించి న‌న్ను ఏనాడూ అడ‌గ‌లేదు. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు నేను బ్యాంకు ఇచ్చిన ఎడ్యుకేష‌న్ లోన్‌ని తిరిగి క‌ట్టేశాను. ఈ రోజు మా అబ్బాయి నెల‌కు ఐదు ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడంటే అదంతా శివ కార్తీకేయ‌న్ వ‌ల్లే` అని చెప్పుకొచ్చారు.

ఎంత ఎదిగినా మ‌న మూలాలు మ‌ర్చిపోతుంటారు కొంద‌రు కానీ శివ కార్తికేయ‌న్‌మాత్రం త‌న మూలాల్ని మ‌ర్చి పోలేద‌ని, క‌ఫ్ట‌కాలంలో ఉన్న వారు స‌హ‌యం అగిడితే ఎంత వ‌ర‌కైనా వెళ‌తాన‌ని త‌న వ్య‌క్తిత్వాన్ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేయ‌డం గ్రేట్ అని కోలీవుడ్ వ‌ర్గాలు శివ కార్తికేయ‌న్‌పై ప్ర‌శంసల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అభిమానులు కూడా శివ కార్తికేయ‌న్ ఎలాంటి ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా ప్రేమ్ కుమార్‌కు స‌హాయం చేయ‌డాన్ని కొనియాడుతున్నారు.

Tags:    

Similar News