అఫిషియల్.. చరణ్ పెద్ది మళ్లీ వాయిదా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు సనా కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.;

Update: 2026-04-15 13:06 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు సనా కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన ఆ చిత్రాన్ని, ఇప్పుడు జూన్ నెలకు పోస్ట్‌ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

నిజానికి.. టాలీవుడ్‌ లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో పెద్ది ఒకటి. ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఆ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో విడుదల తేదీపై వచ్చిన తాజా ప్రకటన అభిమానుల్లో చర్చకు దారి తీసింది.

మేకర్స్ వివరాల ప్రకారం, పెద్ది సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, సినిమా అవుట్‌ పుట్‌ పై మేకర్స్ సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ అనుభవం అందించాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

టెక్నికల్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని చిత్ర బృందం కృషి చేస్తోంది. ఈ క్రమంలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం చెన్నైలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తో కలిసి రీ-రికార్డింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌ కు సంబంధించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, సినిమా విడుదలకు సంబంధించి జూన్ నెలలో రెండు తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా జూన్ 4వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే, ఆ తేదీని వినియోగించుకుని జూన్ 4న పెద్దిని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు, అది సాధ్యంకాకపోతే.. జూన్ 25వ తేదీని మరో ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారని సమాచారం.

ఇక ప్రత్యేక పాట చిత్రీకరణ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేసి, సినిమా విడుదలకు సిద్ధం చేయనున్నారు. మొత్తానికి.. పెద్ది సినిమా వాయిదా పడినప్పటికీ, బెస్ట్ కంటెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు రావాలనే లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఓపికకు తగిన ప్రతిఫలం అందించేలా సినిమాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News