ఆ ఇద్ద‌రికీ స‌క్సెస్ ఎంతో కీల‌కం

ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఇప్పుడు మేక్ ఆర్ బ్రేక్ స్థాయిలో నిలిచిన సినిమా లెనిన్. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత వ‌స్తున్న ఈ సినిమా ఆమెకు చివరి ఆశగా మారింది.;

Update: 2026-04-15 14:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌లకు మొదటి కొన్ని సినిమాలే కెరీర్‌ను నిర్ణయించే కీలక దశగా మారుతున్నాయి. అలాంటి కీలక పరిస్థితిలోనే ఇప్పుడు భాగ్య‌శ్రీ బోర్సే ఉంది. మొద‌టి సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ప్ర‌మోష‌న్స్ తో భారీగా హైప్ తెచ్చుకున్న ఆమె, టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ గా కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడం ఆమె కెరీర్‌కు మొదటి షాక్‌గా మారింది. ఆ తర్వాత కూడా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. కానీ త‌ర్వాత చేసిన కింగ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అమ్మ‌డి కెరీర్ రిస్క్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఇప్పుడు మేక్ ఆర్ బ్రేక్ స్థాయిలో నిలిచిన సినిమా లెనిన్. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత వ‌స్తున్న ఈ సినిమా ఆమెకు చివరి ఆశగా మారింది. ఈ సినిమాలో ఆమెకు కేవలం గ్లామర్ పాత్ర కాకుండా కథలో ప్రాముఖ్యత ఉన్న రోల్ ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో, గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా.. స‌క్సెస్ లేకపోతే అవేవీ ఉప‌యోగ‌ప‌డ‌వ‌నే రియాలిటీ కూడా ఆమె పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించినప్పటికీ, బాక్సాఫీస్ రిజల్ట్ లేకపోతే ఆ క్రేజ్ ఎక్కువకాలం నిలవదని ఇండస్ట్రీలో స్పష్టమైన అభిప్రాయం ఉంది.

ఇక లెనిన్ సినిమాలో ఆమెకు జోడీగా నటిస్తున్న అఖిల్ అక్కినేని పరిస్థితి కూడా అంతే ఉంది. ఆయన కూడా డెబ్యూ తర్వాత ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఇద్దరికీ డబుల్ రిస్క్.. డబుల్ హోప్ గా మారింది. ఇద్దరి కెమిస్ట్రీ, కథలోని ఎమోష‌న్, మాస్ ఎలిమెంట్స్.. అన్నీ కలిసి పనిచేస్తేనే ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉంది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్త హీరోయిన్‌లపై ప్రెజర్ మరింత పెరిగింది. మొదటి రెండు మూడు సినిమాల్లోనే హిట్ ఇవ్వకపోతే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ కాంపిటీషన్ మధ్య భాగ్యశ్రీ బోర్సే కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడొక‌ హిట్ అవసరం. అదే సమయంలో, ఫ్లాప్స్ నుంచి తిరిగి లేచిన హీరోయిన్ల కథలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. అందువల్ల లెనిన్ ఆమెకు ఒక రిడంప్షన్ స్టోరీగా మారే అవకాశం కూడా ఉంది. మొత్తానికి, ఈ సినిమా ఫలితం ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పే స్థాయిలో ఉంది. హిట్ అయితే స్టార్ స్టేట‌స్, ఫ్లాప్ అయితే రిస్క్ అనే సిట్యుయేష‌న్ లో నిలిచిన భాగ్యశ్రీ బోర్సేకు లెనిన్ నిజమైన అగ్నిపరీక్షగా మారింది.

Tags:    

Similar News