జూన్ బాక్సాఫీస్ వార్ షురూనా?

జూన్ నెలలో అగ్ర తారల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుండటంతో సినిమా ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది.;

Update: 2026-04-15 11:45 GMT

వేసవి ముగింపు - వర్షాకాలం ఆరంభ వేళ బాక్సాఫీస్ వద్ద వేడి సెగలు పుట్టబోతున్నాయి. జూన్ నెలలో అగ్ర తారల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుండటంతో సినిమా ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. కేవలం ఒక పరిశ్రమకే పరిమితం కాకుండా? సౌత్ ఇండియాలోని అగ్ర నటులందరూ పాన్-ఇండియా మార్కెట్‌పై కన్నేయడంతో జూన్ బాక్సాఫీస్ వార్ గెలుపు ఎవరిదనే చర్చ సినీ వర్గాల్లో అప్పుడే మొద‌లైంది.`కేజీఎఫ్` సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ చాలా కాలం తర్వాత `టాక్సిక్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను జూన్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యష్ మేనరిజమ్స్ - గీతూ మోహన్ దాస్ టేకింగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. యష్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటి వసూళ్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా జూన్ రేసులో ముందున్నాడు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ న‌టిస్తోన్న `పెద్ది` చిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ వేగం పెంచడంతో ఈ సినిమా కూడా జూన్‌లోనే థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చరణ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం యష్‌కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే? బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోరు రసవత్తరంగా మారుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. కానీ ఆ డేట్ మారుతుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి బ‌లంగా వినిపిస్తోంది.

కన్నడ ఇండస్ట్రీ నుండి వ‌స్తోన్న‌ మరో భారీ చిత్రం `కేడి ది డెవిల్`. యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కూడా భారీ అంచనాలున్నాయి. రెట్రో లుక్‌లో ధ్రువ సర్జా లుక్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. జూన్ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసి పాన్-ఇండియా స్థాయిలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. యాక్షన్ జోనర్ సినిమాలకు జూన్ నెలలో మంచి ఆదరణ ఉంటుందనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నారు. ఈ రేసులోకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రాజెక్టు రావడంతో జూన్ నెల మరింత కీలకంగా మారుతోంది.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న డ్రాగ‌న్ చిత్రం జూన్ లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తోన్న నేప‌థ్యంలో నిజంగా రిలీజ్ అయితే? వార్ ఎలా ఉంటుందా? అన్న‌ది ఊహ‌కే అంద‌డం లేదు. అలాగే అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న `లెనిన్` కూడా జూన్ లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా బాలీవుడ్ నుంచి అలియాభ‌ట్ , శార్వ‌రి వాఘ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న‌ `ఆల్పా` కూడా రిలీజ్ అవుతుంది. య‌శ్ రాజ్ ఫిలింస్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న చిత్ర‌మిది. దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతోన్న తొలి లేడీ స్పై చిత్రమిది.

ఇవ‌న్నీ రిలీజ్ అయితే జూన్ నెల భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేక మాసంగా నిలిచిపోయే అవ‌కాశం ఉంది. యష్, రామ్ చరణ్, ధ్రువ సర్జా వంటి స్టార్ హీరోల చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం వల్ల వందల కోట్ల వ్యాపారం జరగనుంది. పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు కంటెంట్ బాగున్న సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. మ‌రి బాక్సాఫీస్ యుద్ధంలో ఏ హీరో పైచేయి సాధిస్తాడా? ఏ సినిమా క్లీన్ స్వీప్ చేస్తుందో? తెలియాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News