వామ్మో.. ఇల్లాళ్లు వండి తిని అంట్లు తోమారట‌!

Update: 2020-07-17 05:00 GMT
మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ ని సెల‌బ్రిటీలు న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తున్నారు. క్వారంటైన్ డేస్ ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. వైర‌స్ త‌ర‌లి వెళ్లిపోయి య‌థావిథి సన్నివేశంలో ప‌డ్డాక ఈ తీపి గుర్తుల్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకోవ‌డం ఖాయం. కొంద‌రు సెల‌బ్రిటీలు బాత్రూమ్ లు క‌డిగారు. కిచెన్ మొత్తం క్లీన్ చేసి గ‌రిటె తిప్పారు. మ‌రికొంద‌రు క్రిమి సంహారకాల‌తో వ‌రండా స‌హా ఇంట్లో గ‌దుల‌న్నీ శుభ్రం చేశారు. ఇల్లు వాకిలి ఊడ్చి ఆత్మ‌సంతృప్తి పొందారు.

అయితే చాలామంది సెల‌బ్రిటీలు వంట నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపించారు. అందులో సమంత‌.. పూజా హెగ్డే.. త‌మ‌న్నా లాంటి అందాల నాయిక‌లు ఉన్నారు. ఇంత‌కుముందు డాడీని బ్లాక్ మెయిట్ చేస్తూ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కిచెన్ లో గ‌రిటె తిప్పిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల కొంత‌కాలంగా వంట చేస్తున్నానోచ్ అంటూ అక్కినేని కోడ‌లు స‌మంత కూడా ఇన్ స్టాలో ఆ ఫోటోలు వీడియోల్ని షేర్ చేశారు.

తాజాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఆ ఛాన్స్ వ‌చ్చింది. త‌న‌లో ఉన్న వంట మ‌నిషిని బ‌య‌ట‌కు తీశాన‌ని పొంగిపోయేంత‌గా ఏం చేసిందో తెలీదు కానీ మిల్కీ ఎంతో సంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఇంత‌కుముందు షూటింగుల‌తో విరామం లేక‌పోవ‌డం వ‌ల్ల కుదిరేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ కుదురుతున్నాయ‌ని ఆనందం వ్య‌క్తం చేసిన మిల్కీ ఇల్లునే హోట‌ల్ గా మార్చేశాన‌ని .. కాస్త ఖాళీ చిక్కినా వంట వండాన‌ని తెలిపారు. ఇంట్లో ఏది ఎక్క‌డ ఉందో తెలుసుకుంద‌ట‌.

మొద‌టిసారి‌ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత నెమ్మ‌దిగా అల‌వాటైపోయింద‌ని మిల్కీ తెలిపింది. అన్న‌ట్టు వండి తిన‌డ‌మే కాదు.. ఆ త‌ర్వాత వంటిల్లు శుభ్ర‌ప‌రుచుకుని అంట్లు తోమాన‌ని కూడా మిల్కీ తెలిపింది. మొత్తానినికి వంట నేర్చుకోవ‌డంతో పాటు ఆ త‌ర్వాత క్లీనింగ్ ప్రాసెస్ లో ఎలాంటి భేష‌జం లేకుండా ఒక సాధార‌ణ‌ ఇల్లాలి మాదిరిగా అంట్లు తోమార‌ని కూడా తేలిందన్న‌మాట‌.
Tags:    

Similar News