• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాడీ ఉన్నంత మాత్రాన సూపర్...

బాడీ ఉన్నంత మాత్రాన సూపర్ స్టార్ కాలేవు

By - Tupaki Desk
Update: 2019-08-02 05:15 GMT
ఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కానీ మిగిలిన సీజన్ల తో పోలిస్తే బిగ్ బాస్ 3లో వివాదాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ షో ప్రారంభం కావటానికి ముందే.. మా బాస్ ను ఎలా శాటిస్ ఫై చేస్తావంటూ ప్రశ్నించారని పేర్కొంటూ ప్రెస్ మీట్లు పెట్టటమే కాదు.. పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు ఇవ్వటం తెలిసిందే. ఇలా మొదలైన ఈ సీజన్ లో వివాదాలకు కొదవ ఉండట్లేదు. సీమ యాసలో అన్న మాటకు వరుణ్ ఫైర్ కావటం.. నల్లగా ఉన్నాడని కర్రోడా అంటూ చేసిన వ్యాఖ్యలతో పాటు.. మూడు గొడవలు.. ఆరు తిట్లు అన్నట్లుగా హాట్ హాట్ గా సాగుతోంది హౌస్ మొత్తం.

వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా సరే.. తన నోటి ముందు బలాదూర్ అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తోంది. ఘాటు వ్యాఖ్యలతో పాటు.. అందరూ తప్పు పట్టేలా దురుసు మాటల్ని సింఫుల్ గా అనేస్తోంది. దూకుడుగా వ్యవహరించటం ద్వారా తనదైన గుర్తింపును సొంతం చేసుకోవటంతో పాటు.. రెబల్ గా వ్యవహరించాలన్న ధోరణిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

డైమండ్ చేజిక్కించుకొని అధికారాన్ని సొంతం చేసుకున్న కింగ్ అలీ రెజాను ఉద్దేశించి తమన్నా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. అలీ రెజానను అనేసిన మాటలు అవాక్కు అయ్యేలా చేశాయి. బాడీ ఉన్నంత మాత్రాన సూపర్ స్టార్ కాలేరంటూ అలీ రెజాను ఉద్దేశించి తమన్నా చేసిన వ్యాఖ్యలు హౌస్ లో హీట్ పుట్టించాయి. ఇరువురి మధ్య మాటా మాటా పెరగటమే కాదు.. పెద్ద రచ్చే జరిగింది.  అలీ విలన్ అని.. తాను హీరోయిన్ గా తమన్నా అభివర్ణించుకోవటం వరకూ వెళ్లింది.

తన దురుసుతనంతో అలీని ఒక రౌండ్ ఇచ్చుకున్న తమన్నా.. తర్వాత తన టార్గెట్ ను కూల్ అన్షురెడ్డిపై పెట్టింది. అందంగా ఉన్నావు.. సిగ్గు శరం లేకుండా అలీ రెజా పక్కన ఎంత బాగా కూర్చున్నావంటూ చేసిన వ్యాఖ్యలు హౌస్ లో పెను దుమారాన్నే రేపాయి. తమన్నా వ్యాఖ్యల్ని హౌస్ మేట్స్ అందరూ తప్పు పట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంటి సభ్యుల్ని ఇరిటేట్ చేయాలన్నట్లుగా తమన్నా లక్ష్యమన్నట్లుగా ఉంది. మొత్తంగా ఈ సీజన్ లో తొలిసారి కెప్టెన్ అవకాశాన్ని వరుణ్ సందేశ్ సొంతం చేసుకున్నారు. దీంతో.. ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు.
Tags:    
  • Tamanna Simhadri 
  • Ashu Reddy 
  • Ali Reza 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS