ఫోటోస్టోరి: మిల్కీ ఇస్ట‌యిల్ కి మ‌తులు చెడాల్సిందే

Update: 2021-04-07 17:30 GMT
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా గ‌త కొంత‌కాలంగా ముంబై టు హైద‌రాబాద్ ప్ర‌యాణాల‌తో హ‌డావుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ముంబై ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం ట్రై చేస్తూనే ఇటు టాలీవుడ్ సినిమాల్ని పూర్తి చేస్తోంది.

నామ్ హై జ్వాలారెడ్డి.. !! అంటూ త‌మ‌న్నా సీటీమార్ లో గోపీచంద్ తో పోటాపోటీగా మెరుపులు మెరిపించ‌నుంది.  త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం త‌మ‌న్నా సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు హిందీ వెబ్ సిరీస్ న‌వంబర్ స్టోరి స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. అనీల్ రావిపూడి ఎఫ్ 3తో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాల్లోనూ త‌మన్నా న‌టిస్తోంది.

మ‌రోవైపు ఈ భామ ఇన్ స్టా ఫోటోలు అంతే వైర‌ల్ గా మారుతున్నాయి. అప్పుడే షూటింగ్ ముగించి త‌న బ‌సకు వెళుతూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ లుక్ లో త‌మ‌న్నా అద్భుతంగా ఉంద‌ని త‌న‌దైన రూపంతో క‌వ్విస్తోంద‌ని ఒక అభిమాని అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి ఆ డిజైన‌ర్ లుక్ లో త‌మ‌న్నా సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. బ్లూ డెనిమ్ బాట‌మ్ కి కాంబినేష‌న్ గా సింపుల్ డిజైన‌ర్ టీష‌ర్ట్ లో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. ఇక ఇటీవ‌ల డ్రెస్ ఏదైనా కానీ థైషోస్ కామ‌న్ గా మార‌డంతో యూత్ దీనిపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటోంది.
Tags:    

Similar News