అమ్మానాన్నలే అమ్మేసుకున్నారు...
ఆరుషి తల్వార్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో ఇది ఒకటి. తల్లిదండ్రులే ఆరుషిని హత్య చేశారంటూ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా సంక్లిష్టమైనదే. ఆరుషి స్టోరీపై ఈ ఏడాది ప్రారంభంలో రహస్య పేరుతో ఓ మూవీ రిలీజైంది. మనీష్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆరుషి ఉదంతంపై తల్వార్ పేరుతో మరో మూవీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలోఇర్ఫాన్ ఖాన్ - కొంకణా సేన్ శర్మ - టబులు నటించారు.
కొత్త మూవీ పై రహస్య డైరెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. తల్వార్ పేరుతో తెరెకెక్కిస్తున్న చిత్రం కోసం.. ఆ తల్వార్ తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో సొమ్ము తీసుకున్నారన్నాడు మనీష్ గుప్తా. నేరం నిరూపితమై శిక్ష పడ్డ ఆ పేరెంట్స్ ను అమాయకలుగా చిత్రీకరిస్తూ.. తల్వార్ తెరకెక్కిందని చెప్పాడు. వీరు తనను కూడా సంప్రదించారని, ఏ పాపం తెలీనివిధంగా స్టోరీ ఉండాలని కోరినట్లుగా చెప్పాడు మనీష్. అయితే.. తాను ఒక ఎంటర్ టెయినర్ గా ప్రజలకు సినిమా అందించేందుకు ప్రయత్నించానని... కోర్టు కోసమో, ముద్దాయిల కోసమో సినిమా తీయలేదన్నాడు మనీష్.
తాను తీసిన రహస్యకు.. ఇప్పుడు రాబోతోన్న తల్వార్ కు ప్రధానమైన తేడా ఇదేనంటున్నాడు మనీష్. కొంతమంది తనపై కేసులు వేసి సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. మొత్తానికి ఒకే స్టోరీపై రెండు యాంగిల్స్ లో తీసిన రెండు సినిమాలు ఒకే ఏడాది విడుదల కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.