ఆ సినిమా కోసం బాలీవుడ్ తహతహ
బాలీవుడ్ బాగా రెస్పెక్ట్ ఇచ్చే దర్శకుల్లో విశాల్ భరద్వాజ్ ఒకడు. మ్యూజిక్ డైరెక్షన్ నుంచి నిర్మాణం, దర్శకత్వంలోకి అడుగుపెట్టిన విశాల్.. అద్భుతమైన సినిమాలు తీశాడు, నిర్మించాడు. అతడి చివరి సినిమా ‘హైదర్’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. విశాల్ తర్వాత ఏ సినిమా తీస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈసారి విశాల్ దర్శకత్వం చేయట్లేదు. నిర్మాతగా ఓ సెన్సేషనల్ సినిమాను అందిస్తున్నాడు. ప్రసిద్ధ రచయిత గుల్జార్ తనయురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పేరు.. తల్వార్.
ఇది ఓ సెన్సేషనల్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా. కొన్నేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుషి తల్వార్ మర్డర్ కేసు గుర్తుంది కదా. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరికి ఆరుషి తల్లిదండ్రులే దోషులని తేలడం పెద్ద షాక్. ఈ కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు విపరీతమైన ఆసక్తి రేపాయి. ఈ కథనాల్నే ఆధారంగా చేసుకుని ‘తల్వార్’ సినిమాను రూపొందించారు. ఆరుషి తండ్రి పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ లాంటి గ్రేట్ యాక్టర్ నటిస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే టొరెంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా విమర్శకుల ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.