• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోయిన్ ని వదలని...

ఆ హీరోయిన్ ని వదలని తాప్సీ!

By - Tupaki Desk
Update: 2019-08-15 07:55 GMT
కంగనా రనౌత్ ను వదలడం లేదు తాప్సీ. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై తాప్సీ విమర్శలు చేస్తూనే ఉంది. కంగనా సోదరి రంగోలీ బాలీవుడ్ జనాలను ఇష్టానుసారం విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సోదరి స్టార్ హీరోయిన్ అయ్యిందని రంగోలి మిగతా వాళ్లను విమర్శిస్తోంది. లోలోన గొడవలు ఏమున్నాయో కానీ..కంగనా ఆమె సోదరి అందరి మీదా విరుచుకుపడుతూ ఉన్నారు.

అలా వారు తాప్సీని కూడా విమర్శించారు.  తాప్సీ తన సోదరిని అనుకరిస్తోందని అంటూ రంగోలీ విమర్శలు చేసింది. కంగనాకు తాప్సీ ఒక చౌకబారు నకలు అని రంగోలీ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆ విషయంలో తాప్సీ స్పందించింది. రంగోలీ వ్యాఖ్యలను స్వాగతిస్తూనే తాప్సీ సెటైర్లు వేసింది. తను చౌక అనే విషయాన్ని ఒప్పుకుంటూ, తను కంగనా స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోనంటూ తాప్సీ వ్యంగ్యంగా స్పందించింది.

ఆ సంగతలా ఉంటే.. తాజాగా మరోసారి తాప్సీ స్పందించింది. కంగనాను ఉద్దేశించి తాప్సీ పంచ్ లు వేసింది. తమ తాజా సినిమా 'మిషన్ మంగళ్' ను కంగనా ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని తాప్సీ గుర్తు చేసింది. 'ఇండస్ట్రీలోని హీరోయిన్లకు కంగనా ఒక మాట చెబుతూ ఉంటారు. మహిళలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని, హీరోయిన్లు ఒకరి సినిమాకు మకొరు సహకరించుకోవాలని కంగనా చెబుతుంటారు. మరి 'మిషన్ మంగళ్' లో ఐదు మంది హీరోయిన్లం నటించాం. అది మహిళా ప్రధానమైన సినిమా. ఆ సినిమాను కంగనా ఎక్కడా ప్రమోట్ చేయలేదు. తను ప్రధాన పాత్రలో నటించే సినిమాలను అందరూ ప్రమోట్ చేయాలనే కంగనా - ఇతర మహిళా ప్రధానమైన సినిమాలను ఎందుకు ప్రమోట్ చేయడం లేదు..' అంటూ తాప్సీ చురకలు అంటించింది.
Tags:    
  • Taapsee 
  • Kangana Raunat 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS