సైరా: కర్నూలు కాదా.. మరెక్కడ?

Update: 2019-09-12 05:50 GMT
మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రం 'సైరా' త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేస్తున్నారు.  ఈ డేట్ మారే ఆవకాశం ఉందని కొన్ని వార్తలు వచ్చాయి కానీ చరణ్ మాత్రం పక్కాగా అనుకున్న సమయానికే 'సైరా' రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం మార్పు చేర్పులు ఉన్నాయని సమాచారం. 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 15 వ తారీఖున జరపాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  ఉయ్యాలావాడ నరసింహారెడ్డి కర్నూలు ప్రాంతానికి చెందినవారు కాబట్టి కర్నూలు లో ఈ కార్యక్రమం జరపాలని భావించారు.  అయితే తాజా సమాచారం ప్రకారం 'సైరా'  ఈవెంట్ ను హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో సెప్టెంబర్ 18 న జరపాలనే ఆలోచనకు వచ్చారట.  మరి ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్.. డేట్ మారిందని తెలియరాలేదు.  

'సైరా' రిలీజ్ కు మరో ఇరవై రోజుల సమయమే ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ప్రమోషన్స్  ఊపందుకోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ సందడి మొదలవుతుందని.. రిలీజ్ వరకూ నాన్ స్టాప్ గా సైరా టీమ్ ప్రమోషన్స్ చేపడతారని అంటున్నారు.  మెగాస్టార్ రీఎంట్రీ సినిమా 'ఖైది నెం.150' తో సూపర్ హిట్ సాధించారు.  ఆ సినిమా తర్వాత రానున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ 'సైరా' రిలీజ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.  సాధారణ ప్రేక్షకుల్లో కూడా 'సైరా' పై ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరి ప్రమోషన్స్ తో ఆ హైప్ ను ఎంత వరకూ పీక్స్ కు తీసుకెళ్తారో వేచి చూడాలి.

    

Tags:    

Similar News