• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా పాన్ ఇండియా.. మెగా...

సైరా పాన్ ఇండియా.. మెగా ప్ర‌మోష‌న్ ఏది?

By - Tupaki Desk
Update: 2019-09-25 04:46 GMT
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఇంకా రిలీజ్‌ కు ఏడు రోజులే మిగిలింది. ఈ స‌మ‌యంలో మెగా కాంపౌండ్ ఎలాంటి హ‌డావిడీ చేయ‌క‌పోవ‌డం ప‌లువురు విశ్లేష‌కుల్ని... ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. టీజ‌ర్‌- ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు ముస్తాబ‌వుతున్న ఈ చిత్ర ప్ర‌చారం మాత్రం ఆ స్థాయిలో చేయ‌డం లేదు. ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్ ఇప్ప‌టికీ మొద‌లు పెట్ట‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ప్ర‌భాస్ న‌టించిన `సాహో` చిత్రానికి టీమ్ అంతా నెల ముందే ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్ కోసం వెళ్లింది. ప్ర‌త్యేకంగా ప్ర‌చారం కోసం చిత్ర బృందం హెలీక్యాప్ట‌ర్స్ ని వాడి మ‌రీ ప్ర‌చారం అద‌ర‌గొట్టారు. ఆ టీమ్ తో పోలిస్తే `సైరా` విష‌యంలో మెగా కాంపౌండ్ చాలా వెన‌క‌బ‌డి వుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా తెలుగు-త‌మిళ భాష‌ల‌తో పాటు మ‌ల‌యాళ‌- హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కాబోతోంది. అయితే తెలుగులో త‌ప్ప ఇప్ప‌టికీ ఇత‌ర భాష‌ల్లో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్ట‌లేదు. హీరోయిన్స్ కానీ.. ద‌ర్శ‌కుడు... నిర్మాత‌.. ఇత‌ర కీల‌క పాత్ర ధారులు అస‌లు ప్ర‌చార బ‌రిలోకి దిగ‌లేదు. ఆ హ‌డావిడే ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. బాలీవుడ్‌లో ఫ‌ర్హాన్ అక్త‌ర్ రిలీజ్ చేస్తున్నా అక్క‌డ కూడా ప్ర‌మోష‌న్స్ న‌త్త‌న‌డ‌క‌నే సాగుతున్నాయి.

బాలీవుడ్ సూప‌ర్‌ స్టార్స్ స‌ల్మాన్‌ ఖాన్‌.. అమీర్‌ ఖాన్ ఈ చిత్ర ట్రైల‌ర్ గురించి ట్వీట్ చేసినా వారందించిన క్రేజ్ ని `సైరా` టీమ్ క్యాష్ చేసుకోలేక‌పోయింది. దీంతో మెగా కాంపౌండ్ ప్లానింగ్ ఇంత వీకా అని అంతా విమ‌ర్శిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కి కొద్ది రోజుల ముందు `సైరా` ప్ర‌మోష‌న్స్ చాలా వీక్ గా వున్నాయ‌ని.. చిరు సినిమాకు చేయాల్సిన ప‌బ్లిసిటీ చేయ‌డం లేద‌ని మెగా అభిమానులు కొంత మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా విమర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయినా మెగా కాంపౌండ్ మేల్కోక‌పోవ‌డం విచిత్ర‌మే.


Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Movie 
  • Telugu News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS