• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్‌......

ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్‌... నిజ‌మేనా?!

By - Tupaki Desk
Update: 2015-07-28 05:02 GMT
మెగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ ల‌తో క‌లిసి న‌టించిన కాజ‌ల్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ తోనూ జోడీ క‌ట్టాల‌ని ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తోంది. కొన్నిసార్లు ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. ఇక ఈసారి మాత్రం వీరిద్ద‌రి జోడీ ప‌క్కా అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌వ‌న్‌ కళ్యాణ్ క‌థానాయ‌కుడి గా న‌టిస్తున్న గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెల్ `స‌ర్దార్‌`లో క‌థానాయిక‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తొలుత ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్‌ ని హీరోయిన్‌ గా ఫిక్స్ చేశారు. ప‌వ‌న్‌, అనీషాల‌పై ఫొటోషూట్‌ లు కూడా చేశారు. కానీ కొన్నికార‌ణాల వ‌ల్ల అనీషాని సినిమా నుంచి త‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్‌కి త‌గ్గ‌ట్టుగా ఓ స్టార్ హీరోయిన్‌ ని ఎంపిక చేసుకోవాల‌ని చిత్ర‌బృందం కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చివ‌రికి ఆ అవ‌కాశాన్ని కాజ‌ల్‌ కి ఇచ్చార‌నీ, ఇటీవ‌లే చిత్ర ద‌ర్శ‌కుడు బాబీ, కాజ‌ల్ మ‌ధ్య క‌థ గురించి డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని తెలిసింది. ఈ నెల 29 నుంచి సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతోంది. ఈ షెడ్యూల్ నుంచి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ షూటింగ్‌ లో  పాల్గొన‌బోతున్నాడు. ప‌వ‌న్‌ తో పాటు హీరోయిన్ కూడా సెట్స్‌ కి వ‌స్తుంద‌ట‌. సో... ఆ రోజే సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలిపోనుంది. చిత్ర‌బృందం మాత్రం అటు సినిమా పేరు గురించి కానీ, ఇటు హీరోయిన్ గురించి కానీ బ‌య‌ట‌కి చెప్ప‌డం లేదు.

త‌న సొంత సంస్థ‌లో తెర‌కెక్కుతున్న `స‌ర్దార్‌`కోసం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స్వ‌యంగా మ‌రాఠీ న‌టుడు శ‌ర‌ద్ కేల్క‌ర్‌ ని ఎంపిక చేశారు. స్క్రిప్టు విష‌యంలో  ప‌వ‌న్ ప్ర‌త్యేకమైన చొర‌వ తీసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది. `గోపాల గోపాల‌`కి మాట‌లు రాసిన  బుర్రా సాయిమాధ‌వ్‌ ని పిలిపించి స్క్రిప్టు కి తుదిమెరుగులు దిద్ద‌మ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. `గ‌బ్బ‌ర్‌ సింగ్‌ 2` అంటూ అభిమానులు ఎప్ప‌ట్నుంచో మాట్లాడుకొంటున్నారు. ఆ సినిమా పై చాలా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా ఉండాల‌ని సినిమాపై ప‌వ‌న్ చాలా కేర్ తీసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    
  • Pawan kalyan 
  • Kajal Agarwal 
  • sardar movie 
  • telugu NEws 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS