తెలుగు పిల్ల యాబ్స్ అదిరిపోయాయ్

Update: 2016-07-30 09:15 GMT
రెండేళ్ల క్రితం ప్రేక్షకులను 'మాయ' చేసింది తెలుగమ్మాయి సుష్మా రాజ్. ఆ తర్వాత కూడా సినిమాలు చేసినా 'జోరు' మాత్రం చూపించలేకపోయింది. ఈ మధ్యనే త్రిష నాయకిలో కూడా మెరిసిన సుష్మారాజ్.. త్వరలో సునీల్ తో కనిపించబోతోంది. ఈడు గోల్డ్ ఎహె అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో హీరోయిన్ ఈ అమ్మాయే. ఈ సుష్మ త్వరలో పెళ్లి చేసేసుకోబోందనే టాక్ ఉంది కానీ.. చేతిలో ఉన్న సినిమాల కోసం చాలానే ఎఫర్ట్స్ పెడుతోందీ భామ.

ఈడు గోల్డ్ ఎహె మూవీలో అమ్మడిది చాలా స్ట్రాంగ్ కేరక్టర్ అంటన్నారు. అందుకే ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా చూపించేందుకు ఫిట్ నెస్ విషయంలో సూపర్ కేర్ తీసుకుంటోంది. ఇదుగో.. సుష్మారాజ్ షేర్ చేసిన ఈ ఫోటో చూడండి. సిక్స్ ప్యాక్ కి దగ్గరగా ఉన్నట్లు యాబ్స్ పెంచలేదూ? ఇలా కష్టపడ్డం మొదలుపెట్టింది సినిమా కోసమే అయినా.. స్ట్రాంగ్ గా ఉండడంలో బోలెడంత కాన్ఫిడెన్స్ ఉంటుందని.. ఈ భామ ఉపదేశాలు కూడా ఇస్తూ ఉంటుంది.

స్వెట్.. హార్డ్ వర్క్.. హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ.. 'హ్యాపీ వీకెండ్ ఫోక్స్' అంటోంది సుష్మారాజ్. ఏమైనా సునీల్ సిక్స్ ప్యాకులు పెంచి చూపించడం చూశాం కానీ.. ఇప్పుడు సునీల్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ యాబ్స్ తో దర్శనమిస్తుండడం చెప్పుకోవాల్సిన విషయమే.
Tags:    

Similar News