ఉత్తమచిత్రంతో పాటు ఆస్కార్ బరిలో సూర్య - అపర్ణ!

Update: 2021-02-26 11:11 GMT
దక్షిణాది స్టార్ హీరో సూర్య గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. ఆ సినిమా కెరీర్ మలుపుతిప్పింది. అతని గొప్ప యాక్టింగ్ ప్రశంసలు కూడా అందుకుంది. అప్పటినుండి సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన కొత్త సినిమా 'ఆకాశం నీ హద్దురా'. లాక్ డౌన్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అంతేగాక ఈ సినిమాలో సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళిల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. నిజానికి ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్దనే సూపర్ హిట్ అయింది. సూర్య నటనకు బోర్డు సభ్యులు ఫిదా అయ్యారట.

కొంతకాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న సూర్య ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ప్రధానపాత్ర పోషించాడు. అయితే 2021 ఆస్కార్ అవార్డులకు గాను 'ఆకాశం నీ హద్దురా' మూవీ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ బరిలో ఈ సినిమా మూడు విభాగలలో నెక్స్ట్ లెవెల్ కు ఎంపికైనట్లు సమాచారం. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాణసంస్థ వెల్లడించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో సూరరై పొట్రు(ఆకాశం నీ హద్దురా), ఉత్తమనటుడు విభాగంలో సూర్య, ఉత్తమనటిగా అపర్ణ బాలమురళి ఎంపికైనట్లు ఆస్కార్ విడుదల చేసిన జాబితాలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రబృందం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టం కొద్దీ సినిమాకు అవార్డు లభిస్తే మాత్రం రికార్డుబద్దలే అని చెప్పాలి. టుడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యనే ఈ సినిమాను నిర్మించాడు.


Tags:    

Similar News