టాలీవుడ్ లో రోషన్ లు..ఎంతమంది హృతిక్ అయ్యేను?
హృతిక్ రోషన్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోనో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానించే స్టార్.;
హృతిక్ రోషన్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోనో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానించే స్టార్. హృతిక్ డాన్సింగ్ స్కిల్స్ తో ఎంతో మంది స్టార్ హీరోలకు స్పూర్తిగా నిలిచారు. తారక్ మెచ్చిన ఉత్తమ డాన్సర్ ఎవరు అంటే హృతిక్ పేరు మాత్రమే చెబుతారు. ఇండియాలో నెంబర్ డాన్సర్ ఎవరు? అంటే ఎవరు కాదన్నా? అవుననా అది కేవలం హృతిక్ సర్ మాత్రమేనని బల్ల గుద్దీ మరి చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ కూడా హృతిక్ డాన్స్ కు అభిమానే. రామ్ చరణ్ సహా చాలా మంది స్టార్లు హృతిక్ కి అభిమానులుగా ఉన్నారు. హృతిక్ నటన సహా లుక్ కి ప్రత్యేకమైన అభిమానులెంతో మంది ఉన్నారు.
ఇండియాలో ఎవరు పాన్ ఇండియాలో సినిమాలు రిలీజ్ చేయకముందే హృతిక్ సినిమాలు వివిధ భాషల్లో అనువాదమయ్యాయి. అలా రోషన్ పేరు ఇండియా అంతటా ఇప్పటికీ మారుమ్రోగుతోంది. మరి అలాంటి రోషన్ క్రేజ్ ని అందుకునే సత్తా నవతరం రోషన్స్ లో ఎంత మందికి సాధ్యం. ప్రత్యేకించి టాలీవుడ్ లో ఉన్న రోషన్స్ హృతిక్ రోషన్ లా సినిమా రంగంలో సక్సెస్ అవుతారా? అన్నది చూడాలి. వివరాల్లోకి వెళ్తే టాలీవు డ్ లో ఓ నలుగురు రోషన్ లు ఉన్నారు.
వారే శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక. ఈ యువ హీరో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లుక్ పరంగా అచ్చంగా హృతిక్ రోషన్ కి తలపిస్తాడు. హైట్..వెయిట్..హెయిర్ స్టైల్ ప్రతీది హృతిక్ రోషన్ని పోలి ఉంటుంది. యూరోపియన్ స్టార్ లా ఉన్నాడని రామ్ చరణ్ సైతం కితాబిచ్చాడు. అలాగే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్ తో పోలిక చేసిన సందర్భాలెన్నో. సరైన సినిమా పడితే? రోషన్ హృతిక్ రోషన్ లా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడని చాలా మంది నమ్ముతున్నారు. అతడిపై 1000 కోట్లుపెట్టి పాన్ సరైన సబ్జెక్ట్ తో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తే? ఇండియాను అల్లాడించేస్తాడు అన్నది విశ్లేషకుల మాట.
అలాగే యాంకర్ సుమ-రాజీవ్ కనకల కుమారుడు రోషన్ కనకాల సుపరిచితమే. ఇప్పటికే రెండు..మూడు సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. హైట్..వెయిట్ తో..ఉంగరాల జుట్టుతో బాగానే ఉంటాడు. కానీ స్టోరీ సెలక్షన్ రోషన్ ని వెనక్కి నెట్టుతుంది. స్టోరీల విషయంలో మరింత వైవిథ్యంగా ఉండాలి. సరైన హిట్ పడితే? భవిష్యత్ బాగుంటుందన్నది విమర్శకుల అభిప్రాయం. అలాగే `కోర్టు` విజయంతో హర్ష రోషన్ అనే కొత్త కుర్రాడు కూడా బాగానే ఫేమస్ అవుతున్నాడు. తొలి సినిమాతో ఈజ్ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసాడు.
`కోర్టు` మంచి విజయం సాధించడంతో మంచి పేరొచ్చింది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. బాల నటుడిగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సినిమాలపై తన ఫ్యాషన్ చాటుకున్నాడు. రియాల్టీ, డాన్సు షోలతోనూ రాణిస్తున్నాడు. రోషన్ బషీర్ అనే మరో నటుడు ఉన్నాడు. ఇతడు మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన `దృశ్యం` సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న వరుణ్ ప్రభాకర్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అటుపై `డర్టీ హరి`, `మళ్ళీ పెళ్లి` లాంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇలా టాలీవుడ్ లో నలుగురు రోషన్ లు ఉన్నారు. మరి వీళ్లలో హృతిక్ రోషన్ లా సక్సెస్ అయ్యేది ఎంతమందో చూద్దాం.