ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌`. హెచ్‌. విరోద్ డైరెక్ట్ చేయ‌గా క‌న్న‌డ నిర్మాణ సంస్థ‌ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీతో కోలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది.;

Update: 2026-02-15 08:32 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌`. హెచ్‌. విరోద్ డైరెక్ట్ చేయ‌గా క‌న్న‌డ నిర్మాణ సంస్థ‌ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీతో కోలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది. ముందు అనుకున్న ప్ర‌కారం ఈ మూవీని సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ చివ‌రి నిమిషంలో రిలీజ్ వాయిదాప‌డింది. సెన్సార్ వివాదం కార‌ణంగా సినిమా రిలీజ్‌ని చివ‌రి నిమిషంలో నిలిపివేయ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డం, త‌మిళ‌నాట ప్ర‌త్యామ్న‌య శ‌క్తిగా ఎదిగే ప్ర‌మాదం ఉండ‌టంతో త‌న‌పై రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ అరర్ధ్రాంత‌రంగా ఆగిపోయింద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. విజ‌య్‌కి ఈ సినిమాతో రాజ‌కీయ మైలేజీ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించ‌డం వ‌ల్లే సినిమా రిలీజ్‌ని అడ్డుకున్నార‌ని విజ‌య్ పార్టీ శ్రేణుల‌తో పాటు అభిమానులు ఆరోపిస్తున్నారు. జ‌న‌వ‌రి 9 రిలీజ్ పోస్ట్‌పోన్ అయిన త‌రువాత మేక‌ర్స్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం.. రిలీజ్‌కు అనుమ‌తివ్వ‌డం..మ‌ళ్లీ దాన్ని వ్య‌తిరేకిస్తూ సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు కోర్టుని ఆశ్ర‌యించ‌డంతో సినిమా రిలీజ్ ప్ర‌శ్నార్ధ‌కంలో ప‌డిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మేక‌ర్స్ సీబీఎఫ్‌సీపై వేసిన కేసుని విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌కి లైన్ క్లియ్ అయింది. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న దాంట్లో ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. కొంత మంది ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌చారం చేశారు కానీ అది జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ద‌ళ‌ప‌తి అభిమానుల‌కు మ‌రోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది. సినిమా మేక‌ర్స్ కేసుని విత్‌డ్రా చేసుకుని సినిమాని రివిజ‌న్ క‌మిటీకి పంపించడంతో త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ వింటామ‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు కెన‌డాకు చెందిన యార్క్ డిస్ట్రిబ్యూష‌న్ కంప‌నీ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

`జ‌న నాయ‌గ‌న్‌` ఏప్రిల్ 30 వ‌ర‌కు విడుద‌ల కాద‌ని ప్ర‌క‌టించి షాక్ ఇచ్చింది. సినిమా అంత వ‌ర‌కు ఎందుకు వాయిదా ప‌డింది అన్న విష‌యాల‌పై యార్క్ డిస్ట్రిబ్యూష‌న్ వ‌ర్గాలు ఎలాంటి స్ప‌ష్ట‌త‌నివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇలా వ‌రుస‌గా సినిమా వాయిదాల‌మీద వాయిదాలు ప‌డుతూ ఉంటే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిపోతుంద‌ని, ఎప్పుడు వ‌చ్చిందో..ఎప్పుడు వెళ్లిందో తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నారు. అయితే మ‌రో వ‌ర్గం మాత్రం కావాల‌నే సినిమా రిలీజ్‌ని రాజ‌కీయ కక్ష‌లో భాగంగానే వాయిదా వేయిస్తున్నార‌నే కామెంట్‌లు చేస్తున్నారు.

ఏప్రిల్‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న పార్టీతో బ‌రిలోకి దిగుతున్నాడు. సినిమా ముందే విడుద‌లైతే దాని ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల‌పై ఉంటుంద‌ని భావించిన రాజ‌కీయ వ‌ర్గాలు కావాల‌నే `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్‌ని ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ప్లాన్ చేసిన‌ట్టుగా విజ‌య్ పార్టీ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. మ‌రి ఏప్రిల్ 30 త‌రువాతైన `జ‌న నాయ‌గ‌న్‌` థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News