#PSPK లైవ్ నాయ‌కుడు నెగెటివ్ షేడ్ కుద‌ర‌దేమో?

Update: 2020-12-19 14:37 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ చిత్రీక‌ర‌ణను ముగించి త‌దుప‌రి క్రిష్ సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్.. సురేంద‌ర్ రెడ్డి.. సాగ‌ర్ చంద్ర లాంటి ద‌ర్శ‌కులు స్క్రిప్టులతో రెడీ అవుతున్నారు.

సైరా-న‌ర‌సింహారెడ్డి లాంటి పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కించిన సురేంద‌ర్ రెడ్డి చాలా కాలంగా ప‌వ‌న్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే ప్ర‌స్తుత ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు రాజ‌కీయాల నేప‌థ్యంలో స్క్రిప్టును ఎంచుకుని ఆయ‌న ప‌వ‌న్ ని ఒక ప‌వ‌ర్ ఫుల్ పొలిటీషియ‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే రాజ‌కీయ నాయ‌కుడిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తార‌ని ఓ ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. అయితే జ‌నసేనానిగా ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్  లైవ్ పొలిటీషియ‌న్ గా నెగెటివ్ షేడ్ కి అంగీక‌రిస్తారా?  దానివ‌ల్ల జ‌నంలోకి నెగెటివిటీ పంప్ అవుతుంది క‌దా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తోంది ఒక సెక్ష‌న్. అయితే నెగెటివ్ షేడ్ వెన‌క బ‌ల‌మైన కార‌ణం పాజిటివిటీ ని క‌నెక్ట్ చేస్తూ పూర్తి వినోదాత్మ‌కంగా చూపించ‌గ‌ల‌గ‌డంలో సురేంద‌ర్ రెడ్డి అనుభ‌వ‌జ్ఞుడు కాబ‌ట్టి దానిపై అభిమానులు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కాస్త ఆగితే కానీ దీనిపై అధికారికంగా ఏదీ క్లారిటీ రాదు.
Tags:    

Similar News