• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ టైంలోనే ఆయనతో ప్రేమలో...

ఆ టైంలోనే ఆయనతో ప్రేమలో పడ్డానేమో: సూపర్ స్టార్ భార్య

By - Tupaki Desk
Update: 2020-07-02 08:30 GMT
ఇండస్ట్రీలో ఎక్కువ శాతం సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే అసలే కనిపించరు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ కం సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్. ప్రస్తుతం మహేష్ కి భార్యగా.. ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ఎవరి ఫోటోలను వారు.. ఎవరి విషయాలు వారే షేర్ చేస్తే.. మహేష్ బాబు విషయాలు మాత్రం ఆయన భార్య నమ్రతనే షేర్ చేస్తుంది. నమ్రతకి మహేష్ అంటే అమితమైన ప్రేమ. పిల్లలంటే ప్రాణం. అదెలా అంటారా.. నమ్రత చేతి మీద టాటూ చూడవచ్చు. భర్త.. పిల్లలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే నమ్రత ఇటీవలే ఫ్యాన్స్ తో 'అస్క్ మీ యువర్ క్వశ్చన్' అనే లైవ్ లో పాల్గొంది. ఈ లైవ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా ఓపికతో సమాధానం ఇచ్చారు నమ్రత.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఫేవరెట్ హీరో అంటే.. నవ్వుతూనే భర్త మహేష్ పేరు చెప్పేసింది. అలా సరదా ప్రశ్నలలో మీరు ఏది బాగా వండుతారు? అంటే మ్యాగీ నూడిల్స్ అని. లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.. మహేష్ తో పెళ్లి. మరి మీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే బి.గోపాల్ డైరెక్షన్లో సినిమా టైంలో మహేష్ నేను ఫస్ట్ టైం కలిసాం. మేబి అక్కడే మా ప్రేమ పుట్టింది కావచ్చు. ఇక మహేష్ సినిమాలలో ఎప్పుడైనా ఇన్వల్వ్ అవుతారా? అసలు అవ్వను అనేసింది. ఇక మహేష్ తో మళ్లీ సినిమా ఎప్పుడు అంటే.. ఏమో చూడాలి. మళ్లీ మహేష్ - పూరీల సినిమా ఆశించొచ్చా? అంటే అది కాలం నిర్ణయిస్తుంది. మరి మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రొపోజ్ చేశారు? అనే ప్రశ్నకి సమాధానం తెలియదు అనేసింది. అయితే పెళ్లి విషయంలో మాత్రం మహేష్ ని చూడగానే మా పేరెంట్స్ ప్రేమలో పడ్డారని చెప్పింది. చివరగా మీ చేతి పై టాటూ గురించి చెప్తారా అంటే.. టాటూ చూపించి మహేష్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. టాటూలో మహేష్.. గౌతమ్.. సితారల పేర్లు రాసి ఉన్నాయి. దీన్ని బట్టే అర్ధమవుతుంది నమ్రతకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో.. అంటున్నారు నెటిజన్లు. కానీ ఫ్యాన్స్ కోరికలు మాత్రం ఈ లైవ్ ద్వారా బయటపడ్డాయని అంటున్నారు.
Tags:    
  • Namrata 
  • Mahesh Babu 
  • Superstar 
  • Namrata Mahesh babu Love Story 
  • Namrata Interview 
  • Sarkar Vaari Paata 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS