సూపర్ హిట్‌ వెబ్‌ సిరీస్ తెలుగులో..!

Update: 2021-10-20 07:59 GMT
తెలుగు లో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరుగుతోంది. కరోనా ముందు వరకు ఎక్కడో కింది స్థాయిలో ఉన్న ఓటీటీ మార్కెట్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెరిగింది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున తెలుగు కంటెంట్‌ ను చూసేందుకు ఓటీటీ లను ఆశ్రయిస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున ఓటీటీలు వెబ్‌ సిరీస్ లను మరియు కొత్త సినిమాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు ఓటీటీ అనగానే ఆహా గుర్తుకు వచ్చేంతగా ఆహా వారు కంటెంట్ ఇస్తున్నారు. ఇక ఇండియాలో టాప్ లో ఉన్న అమెజాన్ ప్రైమ్ మరియు హాట్‌ స్టార్ ను చేరుకునేందుకు గాను నెట్ ఫ్లిక్స్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో భారీ ఎత్తున హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్ లు వస్తూ ఉంటాయి. ఈ మద్య కాలంలో తెలుగు పై కూడా నెట్‌ ఫ్లిక్స్ దృష్టి పెట్టింది.

ఇండియన్ మార్కెట్‌ లో టాప్‌ లో ఉండాలంటే తెలుగు తో పాటు సౌత్‌ భాషల మార్కెట్‌ కీలకంగా భావిస్తున్న నెట్‌ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకుల కోసం భారీ ఎత్తున కంటెంట్ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే తెలుగు కు చెందిన పలు సినిమా లను కొనుగోలు చేసిన నెట్‌ ఫ్లిక్స్ వారు త్వరలో ఒక భారీ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ సక్సెస్ ను దక్కించుకుని సెన్షేషన్‌ ను క్రియేట్‌ చేసిన స్కైవ్డ్‌ గేమ్ ను తెలుగు లో డబ్‌ చేసి స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్ లోని ప్రధాన పాత్రకు గాను యంగ్‌ హీరో సత్యదేవ్ తో డబ్బింగ్ చెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఆయన డబ్బింగ్ చెప్పి చేతులు దులుపుకోకుండా ఆయనతో వెబ్‌ సిరీస్ ను ప్రమోట్‌ కూడా చేయించాలని భావిస్తున్నారట. అందుకోసం ఆయనతో భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. తెలుగు లో నెట్‌ ఫ్లిక్స్ సొంత కంటెంట్ ను కూడా నిర్మించేందుకు కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది. వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు గాను నెట్‌ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది.



Tags:    

Similar News