భార్య ప్రణతి బర్త్‌డే స్పెషల్.. ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఎన్టీఆర్..
మరి ఈ బర్త్‌డే వేడుకలకు ఎవరెవరు వస్తున్నారు? ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ విశేషాలేంటి? చూద్దాం..;
జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో రేపు పండుగ వాతావరణం నెలకొనబోతోంది. తారక్ ప్రాణప్రదంగా ప్రేమించే ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఈ యంగ్ టైగర్ ఒక అదిరిపోయే 'లావిష్ పార్టీ'కి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ తారక్ విషయంలో వేరే లెవల్‌లో ఉంటుంది. మరి ఈ బర్త్‌డే వేడుకలకు ఎవరెవరు వస్తున్నారు? ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ విశేషాలేంటి? చూద్దాం..
ప్రణతి బర్త్‌డే.. తారక్ స్పెషల్ ప్లానింగ్:
రేపు మార్చి 26 న ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టినరోజు. ప్రతి ఏటా ఈ జంట చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ, ఈసారి మాత్రం ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని తారక్ భావిస్తున్నారట. హైదరాబాద్‌లోని ఒక లగ్జరీ ప్రదేశంలో ఈ విందు ఏర్పాటు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తన భార్యకు సర్ప్రైజ్ ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆయన తన భార్యపై ఉన్న ప్రేమని అప్పుడప్పుడు పోస్టుల ద్వారా తెలియజేస్తుంటారు. ఈ పుట్టినరోజు వేడుక ప్రణతికి ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేలా తారక్ ప్లాన్ చేస్తున్నారట.
గెస్ట్ లిస్టులో ఆ స్టార్స్.. 'డ్రాగన్' టీమ్ సందడి:
ఈ లావిష్ పార్టీకి ఎవరెవరు హాజరవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'డ్రాగన్' సినిమా టీమ్ మొత్తం ఈ వేడుకలో కనిపిస్తారట. వీరితో పాటు ఇండస్ట్రీలోని ఎన్టీఆర్ అత్యంత సన్నిహితులు, మెగా ఫ్యామిలీకి చెందిన కొందరు సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఇక షూటింగ్ గ్యాప్‌లో వస్తున్న ఈ సెలబ్రేషన్స్ వల్ల చిత్ర యూనిట్‌కు కూడా మంచి రిలీఫ్ దొరుకుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఒకపక్క పార్టీ హడావుడి ఉన్నా, మరోపక్క ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'కె.జి.ఎఫ్', 'సలార్' చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా మార్చుకున్నారట. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, తారక్ నటన తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఈ సినిమా విడుదల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నా, మేకర్స్ మాత్రం క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికే ప్రకటించినట్లుగా 2026 జూన్ 25న 'డ్రాగన్' థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే 2026 చివరిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా రేపు జరగబోయే ప్రణతి బర్త్‌డే వేడుకలో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు.