మహేష్ 'వారణాసి' సెట్.. ఘాట్లు, ఇరుకైన వీధులు చూశారా?
పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;
పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ప్రత్యేక విజన్ తో ఆ ప్రాజెక్ట్ ను రూపొందిస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఆ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశాల్లో వారణాసి నగరాన్ని ప్రతిబింబించే మినియేచర్ సెట్స్ ఒకటి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న వారణాసి నగరాన్ని రియలిస్టిక్ గా తెరపై చూపించడం సాధారణ విషయం కాదు. కానీ రాజమౌళి టీమ్ ఘాట్లు, ఇరుకైన వీధులు, ఆలయాల నిర్మాణాన్ని అద్భుతంగా క్రియేట్ చేసి అసలు నగర వాతావరణాన్ని సెట్ల రూపంలోనే సృష్టిస్తోంది.
ఆ సెట్స్ కు సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రియులు అంతా ఫిదా అవుతున్నారు. అదే సమయంలో రియల్ లొకేషన్స్ కు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో కాశీ ఘాట్స్, షాప్స్ సహా వివిధ విజువల్స్ ఉన్నాయి. దీంతో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే సెట్ డిజైన్ విషయంలో రాజమౌళి ఎప్పుడూ రాజీ పడరని తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ విజువల్ గ్రాండియర్ ను మరో స్థాయికి తీసుకెళ్తారు. ఈసారి కూడా అదే శైలిలో పని జరుగుతోందని మినియేచర్ సెట్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇవి కేవలం సినిమా సెట్స్ కాకుండా ఒక కళాఖండంలా కనిపిస్తున్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు.
కాగా, వారణాసి మూవీ దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను రూపొందించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లు, ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థలు పని చేస్తున్నాయి. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తుండగా, హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ పలు దేశాల్లో కొనసాగుతోంది. ఆఫ్రికా, జార్జియా వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం వారణాసి సెట్ లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్స్ ను అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ప్లాన్ చేస్తున్నారు..
ఏదమైనా వారణాసి సినిమా ప్రతి అప్డేట్ తో అంచనాలను మరింత పెంచుతోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిస్తే, ఆ చిత్రం ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంతా భావిస్తున్నారు. ఇక భారీ విజువల్ వండర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవ్వనుంది.