నాకు సన్నీ లియోన్ కి డిగ్రీ చదివే కొడుకా ? హీరో!

Update: 2020-12-10 05:40 GMT
సినీ సెలబ్రెటీల పేర్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వాడేస్తూ ఉంటారు. రకరకాలుగా సినీ ప్రముఖుల పేర్లను తమకు కలుపుకుని వారి అభిమానులు లేదా మరెవ్వరైనా ఉపయోగిస్తూ ఉంటాడు. తాజాగా బీహార్‌ లోని ఒక డిగ్రీ స్టూడెంట్‌ తన తల్లిదండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్‌ హష్మీ మరియు సన్నీలియోన్‌ ల పేర్లు రాశాడు. అప్లికేషన్‌ ఫామ్‌ లో అలాగే ఉండటంతో హాల్‌ టికెట్‌ అలాగే వచ్చింది. ఆ హాల్‌ టికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో వెంటనే ఇమ్రాన్‌ హస్మీ స్పందించాడు. అయ్యో అతడు నా కొడుకు కాదు అన్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా ఫన్నీగా స్పందించాడు. సన్నీలియోన్‌ నుండి ఎలాంటి రియాక్షన్‌ ఇప్పటి వరకు లేదు.

ధన్‌ రాజ్‌ మహత అనే విద్యార్థి హాల్‌ టికెట్‌ లో ఈ తప్పు దొర్లింది. ఈ సంఘటనపై వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఇలాంటి పరిణామాలు సిగ్గు చేటు అంటూ చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ విషయమై విచారణ కమిటీని నిర్వహించింది. అసలు హాల్‌ టికెట్‌ లో వారి పేర్లు ఎలా వచ్చాయి. విద్యార్థి రాశాడా లేదంటే మరెవ్వరైనా ఈ పని చేశారా అంటూ ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Tags:    

Similar News