• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సునీల్‌ విలనీ చేస్తే...

సునీల్‌ విలనీ చేస్తే కామెడీ అయిందే..

By - Tupaki Desk
Update: 2020-01-27 10:12 GMT
కమెడియన్ సునీల్ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. దివ్యంగా సాగుతున్న కామెడీ కెరీర్‌ను అతను ఒకప్పుడు చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. హీరో వేషాల మీద మోజు పడి ఎటూ కాకుండా తయారయ్యాడు. మొదట్లో అతను చేసిన హీరో రోల్స్ బాగానే వర్కవుటయ్యాయి. కానీ ఆ తర్వాత అతను ట్రాక్ తప్పాడు. తనకు సూట్ కాని పాత్రలు, సినిమాలు చేసి పూర్తిగా కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. రెండేళ్ల కిందటే హీరో వేషాలకు సెలవిచ్చేసి మళ్లీ కామెడీ రోల్స్ ట్రై చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. గత రెండు మూడేళ్లలో అతను చేసిన ఏ కామెడీ పాత్రా క్లిక్కవ్వలేదు. ఇంతకుముందు సునీల్‌తో అద్భుతమైన కామెడీ పండించిన దర్శకులు కూడా ఇప్పుడు అతడిని రక్షించలేని పరిస్థిితి లో ఉన్నారు. చివరికి త్రివిక్రమ్ సైతం తన స్నేహితుడి రాతను మార్చలేకపోయాడు.


‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’.. ఇలా వరుసగా తన రెండు సినిమాల్లోనూ సునీల్‌ కు ఛాన్సులిచ్చాడు త్రివిక్రమ్. కానీ ఆ రెండు చిత్రాల్లోనూ సునీల్ నవ్వించ లేకపోయాడు. ఈ సినిమాలకు ముందు, తర్వాత కూడా సునీల్ చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ చేశాడు. అవేవీ వర్కవుట్ కాలేదు. ఇలాంటి సమయంలో సునీల్ ఊహించని టర్న్ తీసుకున్నాడు. మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘డిస్కో రాజా’లో విలన్ పాత్ర చేశాడు. అతను ఇందు లో విలన్‌ గా నటించినట్లు సినిమా రిలీజయ్యే వరకు తెలియదు. అసలు సినిమా లో కూడా చివరి 10 నిమిషాల ముందు వరకు ఆ సంకేతాలే కనిపించవు. హీరో పక్కనే ఫ్రెండుగా ఉంటూ కామెడీనే చేస్తాడు సునీల్. కానీ చివర్లో సునీల్ విలన్ అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తారు. ఐతే ఆ ట్విస్టు ఘోరంగా ఫెయిలైంది. ఈ ఎపిసోడ్లో సునీల్ గెటప్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అప్పటి దాకా సునీల్ చేసిన కామెడీ నవ్వించ లేదు కానీ.. అతను విలనీ చేయబోతే అది కామెడీ కావడం ఇందు లో అసలు ట్విస్టు.
Tags:    
  • Sunils Grey Shades in Ravi Tejas Disco Raja 
  • Telugu News 
  • Telugu Movie Updates 
  • Disco Raja 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS