అయ్యో బ్రేకిచ్చే వాళ్ళు కరువయ్యారే!

Update: 2018-11-19 01:30 GMT
ఈ పాడు లోకం అంతే. సక్సెస్ కు మాత్రమే గుర్తింపు ఇస్తుంది. ఫెయిల్యూర్ కు గుర్తింపు ఉండదు.  ఫెయిల్యూర్ కు గుర్తింపు ఇచ్చేది ఒక్క లవ్ లో మాత్రమే. లేకపొతే దేవదాస్.. సలీం అనార్కలీ క్లాసిక్కులెందుకయ్యాయి? ఎందుకయ్యాయంటే.. దేవదాస్ - సలీం లకు వారి వారి లవ్వర్లతో పెళ్ళైతే పిల్లా పీచు వస్తుంది. వాళ్ళకు మళ్ళీ పీచు.  అదే లవ్ ఫెయిల్యూర్ అయ్యి పెళ్ళి కాకపోతే జగమే మాయ అనొచ్చు జగ్గులో బీరు తాగొచ్చు.

ఈ లాజిక్ ఎబ్బెట్టుగా ఉండొచ్చు. కానీ డీప్ గా అలోచిస్తే కనెక్ట్ కావొచ్చు. సరే ఫెయిల్యూర్ అనుకుంటున్నాం కాబట్టి కమెడియన్ - హీరో - కమెడియన్ ఇలా మూడు పాత్రలు మార్చిన సునీల్ గురించి మాట్లాడుకుందాం.  కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'సిల్లీ ఫెలోస్'.. రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 'అరవింద సమేత' తో గురూజీ లిఫ్ట్ ఇస్తాడు అనుకుంటే.. ఆ లిఫ్ట్ వర్క్ అవుట్ కాలేదు.  ఇక 'అమర్ అక్బర్ అంటోనీ' బేబీ సిట్టర్ బాబ్జీ గురించి చాలా హంగామా జరిగింది. తీరా చూస్తే విషయం శూన్యం.

సినిమాలు ఫ్లాప్ అయితే సునీల్ తప్పేంటి అనుకోవచ్చు గానీ మరో రెండు ఫ్లాపులు తగిలితే.. 'సునీల్.. సునీల్' ఆని ఊగిపోయే ఊపు ఉండదనేది కఠోర వాస్తవం. మరి ఇప్పటికైనా సునీల్ తన పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తాడని ఆశిద్దాం.
    

Tags:    

Similar News