ట్యాలెంటెడ్ యాంక‌ర్ విడాకుల ప్ర‌చారానికి అలా చెక్

Update: 2020-09-15 04:30 GMT
లోకులు ప‌లు గాకులు.. ఎవ‌రిని ఎలా బ‌ద‌నాం చేయాలి! అని ఆలోచిస్తారు. ఫ‌లానా వాళ్లు అదంట క‌దా.. ఇదంట క‌దా!! అన్న అవాకులు చ‌వాకులు చెప్పుకునేందుకు ఇష్ట‌ప‌డే ప్ర‌పంచం ఇది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అన్న‌ట్టు ఈ లోకులు శాడిస్టులు!!

ఏమో.. కార‌ణం ఏదైనా కానీ.. ఇటీవ‌ల టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాంక‌ర్ సుమ క‌న‌కాల‌పై ఓ రూమ‌ర్ వినిపించింది. భ‌ర్త రాజీవ్ క‌న‌కాల నుంచి సుమ విడాకులు తీసుకుంటున్నార‌న్న‌ది దాని సారాంశం. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు విడాకుల పుకారు ప‌రిశ్ర‌మ‌లో వ్యాపించింది. అయితే ఈ పుకార్లకు సుమ ఎంత‌మాత్రం స్పందించలేదు. నిశ్శబ్దంగా మౌన యోగినిలా తన హబ్బీతో ఆనందంగా ఉన్న ఒక ప్లెజెంట్ ఫోటోని షేర్ చేసి విడాకుల రూమ‌ర్ కి చెక్ పెట్టేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో దాంతో పాటే సుమ వినిపించిన క‌విత‌ యూత్ లో ఒక‌టే హాట్ టాపిక్ గా మారింది.

``నా ప్రియమైన రాజా.. నా ప్రేమ.. ఏకత్వం .. ఆనందం ఎప్పటికీ`` అంటూ భ‌ర్త‌పై త‌న ల‌వ్ ని కురిపించింది. సుమ క‌వితాత్మ‌క హృద‌యం త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే అద్భుత‌మైన తెలుగు ప‌ద‌జాలం ఇందులో క‌నిపిస్తోంది. ఇక భ‌ర్త అంటే ఎన‌లేని ప్రేమ ఉంద‌ని కూడా ఈ ఫోటో చెబుతోంది.  టెలివిజన్ రంగంలో తిరుగులేని రాణి ఆమె. వృత్తిగ‌త జీవితం.. వ్యక్తిగత జీవితం రెండింటినీ సమర్ధవంతంగా సమతుల్యం చేసే యాంక‌ర్ గా అంద‌రి గుండెల్లో నిలిచి ఉన్నారు.
Tags:    

Similar News